ప్రస్తుతం టాలీవూడ్ లో రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరు వరుసగా సినిమాలు చేస్తున్న సఙ్గాహి తెలిసిందే. అయితే, కథ నచ్చితే చాలు చిరంజీవి సినిమా చేయడానికి వెనుకాడే పరిస్థితి లేదు అన్నట్టు ఉంది. ప్రస్తుతం చిరు టాలీవుడ్ లో యువ హీరోలతో పోటీ పడి మరీ సినిమాలు చేస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తాజాగా చిరంజీవి "ఆచార్య" అనే సినిమాలో నటిస్తున్న సంగంతి విదితమే. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. కాకపోతే ప్రస్తుతం ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది.

 


ఇకపోతే చిరు ఈ సినిమా తర్వాత మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ రీమేక్ సినిమాలో నటించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ కథను తెలుగులో ఎవరు రెడీ చేస్తారన్నది స్పష్టత లేదు. ప్రస్తుతం టాలీవుడ్ యువ దర్శకులు బాబీ, అనీల్ రావిపూడికి చిరంజీవి ఆ బాధ్యతలు అప్పగించారని వార్తలు వినిపించాయి. అయితే మరి ఇప్పుడు వారిని కాదని, మరో సీనియర్ దర్శకుడికి చిరంజీవి అవకాశం ఇచ్చారని సమాచారం అందుతోంది. తన రీ ఎంట్రీని గ్రాండ్ గా ఖైదీ నెంబర్ 150 రూపంలో ఇచ్చిన వీవీ వినాయక్ కి ఈ అవకాశాన్ని మళ్ళి దర్శకత్వం చేసే ఛాన్స్ ఇవ్వబోతున్నారు.

 

కాకపోతే, 2021 సమ్మర్‌ లో విడుదల కానుంది ఆచార్య సినిమా. తన ఇమేజ్‌ కు అదిరిపోయేలా తెలుగులో ఈ కథను మార్చడానికి సరైన దర్శకుడి కోసం ఎదురు చూస్తున్న చిరంజీవి ఆ అవకాశాన్ని వీవీ వినాయక్ కి మళ్ళి ఇచ్చారు. చిరుకి ఇదివరకే ఠాగూర్, ఖైదీ నెం 150 లాంటి సినిమాలు చేసిన వినాయక్ అయితే ఈ సినిమాను బ్లాక్ బ్లాస్టర్ అని భావించి అవకాశం ఇచ్చారట. దీనికోసం ఇప్పుడు ఆ కథను రెడీ చేస్తున్నాడు వీవీ వినాయక్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: