మన తెలుగు ఇండస్ట్రీలో కీలక పాత్రలు పోషిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ. అటు హీరోయిన్ గాను అనేక ప్రత్యేక పాత్రల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకత రమ్యకృష్ణకు లభించిందనే చెప్పాలి. అందుకే కొందరు స్టార్ డైరెక్టర్ లు కీలక పాత్రలో కోసం రమ్యకృష్ణను నటించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ శివగామి పాత్ర పోషించిన తర్వాత రమ్యకృష్ణకు చాలా డిమాండ్ వచ్చింది. ఇటు మన తెలుగు ఇండస్ట్రీతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా రమ్యకృష్ణకు చాలా డిమాండ్ ఉంది. ఇక మన తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్రహీరోల సరసన ఆమె పాత్ర పోషించడం అనేది ప్రాధాన్యతగా ఉంటుంది అనేది వాస్తవమైన విషయం అనే చెప్పాలి.

 


ఇక దర్శక నిర్మాతలు నటనకు ముఖ్య ప్రాధాన్యత ఉన్న పాత్రలకు రమ్యకృష్ణను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.  తాజాగా త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు రమ్యకృష్ణను తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారు. ఇందులో ముఖ్యమంత్రి పాత్రకు రమ్యకృష్ణను ఎంపిక చేయాలనుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు ఆమె ఈ పాత్ర నుంచి తప్పుకోవడం జరిగింది. ఈ పాత్ర కోసం రమ్యకృష్ణ భారీగా డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 


నిజానికి ఆమె అడగడానికి ముఖ్య కారణం ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యత అని తెలుస్తుంది. ఇక దర్శక నిర్మాతలు అడిగిన రెమ్యూనరేషన్ కి భయపడి రమ్యకృష్ణను వద్దని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె రెమ్యునరేషన్ విషయంలో తగ్గలేదు అంటూ సినీ వర్గాలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఇక ఈ సినిమాని వచ్చే సంవత్సరం వేసవి తర్వాత విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతుంది. ఇక మరి ఈ కీలక పాత్రకి ఎవరిని ఎంపిక చేసుకుంటారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: