బాహుబలి ద్వారా ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు.ఆ సినిమా కోసం ఐదేళ్ళు కేటాయించిన ప్రభాస్ కి మంచి ఫలితమే దక్కింది. ఇప్పుడు ప్రభాస్ తో సినిమా అంటే ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ ఉండాల్సిందే. అలాంటి కథలే ప్రభాస్ దగ్గరికి వస్తాయి. అయితే ప్రభాస్ తో సినిమా చేయడానికి ప్రతీ ఒక్కరూ ముందుకు వస్తుంటారు. కానీ ఆ అవకాశం ఏ ఒక్కరికే దక్కుతుంది. అలాంటి అదృష్టం దక్కించుకున్న వారిలో నాగ్ అశ్విన్ ఒకడు.

 

ఎవడే సుబ్రమణ్యం సినిమాతో డైరెక్టర్ గా మారిన నాగ్ అశ్విన్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మన జీవితంలో ఏం కోల్పోతున్నామో ఆ సినిమా ద్వారా చూపించాడు నాగ్ అశ్విన్. మొదటి సినిమా ద్వారా మంచి సినిమాలు తీయగలనని నిరూపించుకున్నాక, రెండవ చిత్రంపై మరింత బాధ్యత పెరుగుతుంది. అయితే ఆ బాధ్యతకి తగినట్లుగా అంతకి మించిన సక్సెస్ తో వచ్చాడు.

 

రెండవ చిత్రమైన మహానటి సూపర్ సక్సె అయింది. సావిత్రి జీవితకథతో వచ్చిన ఈ చిత్రంలో సావిత్రిగా కీర్తి సురేష్ నటించింది. ఈ చిత్రంలో ఆమె నటనకి కీర్తి సురేష్ జాతీయ ఉత్తమనటిగా అవార్డు దక్కించుకుంది. అయితే మహానటి వచ్చిన రెండేళ్లకి నాగ్ అశ్విన్ తన మూడవ చిత్రాన్ని ప్రకటించాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

 

 

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ బాలీవుడ్ లో వచ్చిన చిత్రం అని అంటున్నారు. ఐశ్వర్యారాయ్, అక్షయ్ కుమార్ జంటగా నటించిన యాక్షన్ రీప్లే సినిమాలోని ఒకానొక పాయింట్ ఆధారంగానే ప్రభాస్ సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు. యాక్షన్ రీప్లేలో హీరో టైమ్ మెషిన్ ద్వారా కాలంలో వెనక్కి వెళ్ళి తాను అనుకున్నది సాధిస్తాడు. నాగ్ అశ్విన్ చిత్రంలోనూ ప్రభాస్, దేశం కోసం కాలంలో వెనక్కి వెళ్తాడట. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే నాగ్ అశ్విన్ నోరు విప్పాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: