టాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్ల్ కొరత ఎక్కువగా ఉందీ అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. వాళ్లకు అవకాశాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. డిమాండ్ ఉన్న వాళ్ళ కోసం దర్శకులు క్యూ కడుతున్నారు. చిన్న హీరోయిన్ అయినా పెద్ద హీరోయిన్ అయినా సరే సోషల్ మీడియాలో కాస్త క్రేజ్ ఉంటే చాలు వాళ్ల తో సినిమా చేయడానికి అగ్ర హీరోలు కూడా ఎక్కువగా దృష్టి పెడుతున్నారు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఇక టాలీవుడ్ లో ఇప్పుడు రష్మిక మంధనా హవా ఎక్కువగా కొనసాగుతుంది. ఆమెతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు హీరోలు. 

 

ఆమె సినిమాలు అన్నీ కూడా దాదాపుగా విజయం సాధించడం తో ఆమెను లక్కీ గర్ల్ అని కూడా అంటుంది టాలీవుడ్. ప్రస్తుతం ఆమె భారీగా పారితోషికం కూడా తీసుకుంటుంది. ఆమె సినిమాల కోసం తమిళంలో కూడా ఎక్కువగానే ఎదురు చూసే పరిస్థితి ఉందీ అనేది కూడా అర్ధమవుతుంది. టాలీవుడ్ లో ఆమె చేస్తున్న సినిమాలను తమిళంలో కూడా చూస్తున్నారు. అక్కడ తెలుగు వచ్చిన వాళ్లకు ఆమె సినిమాలు నచ్చుతున్నాయి. ఇక ఇది పక్కన పెడితే ఆమె అక్కడ నటించే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. 

 

అయినా సరే ఆమె మాత్రం వెనకడుగు వేస్తుంది అంటున్నారు. అక్కడ అగ్ర హీరోలతో ఆమెకు నటించే అవకాశం వచ్చినా సరే ఆమె మాత్రం అక్కడ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపించడం లేదు అని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు. కాని ఆమెకు క్రేజ్ ఉన్నా సరే వాడుకోవడం లేదని మాత్రం కొందరు బలంగా చెప్తున్నారు. అక్కడ సినిమాల్లో ఒక్కసారి హిట్ అయితే మాత్రం అక్కడి ప్రేక్షకులు వదిలే అవకాశం ఉండదు అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: