టాలీవుడ్ జనం ప్రభాస్ పెళ్లి గురించి ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అందరికి తెలిసిందే. ప్రభాస్ పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా జనాలు మాత్రం దాని గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ప్రభాస్ ఈ మధ్య కాలంలో సినిమాల మీదే ఎక్కువగా దృష్టి పెడుతూ వస్తున్నాడు. అతనికి కొంత మంది రాజకీయాలు అంటించి కాస్త భ్రష్టు పట్టించారు కొన్ని కొన్ని విషయాల్లో. దీనితో ప్రభాస్ పూర్తిగా కొన్ని వ్యవహారాలను బయటపెట్టడం మానేసాడు అనేది టాలీవుడ్ జనాల మాట. అతను ఇప్పుడు ఎక్కువగా సినిమాలే చేస్తున్నాడు. 

 

ప్రభాస్ సినిమాల మీద జనాలకు కూడా ఆసక్తి ఉంది కాబట్టి అతను సినిమాలను ఎక్కువగా చెయ్యాలి అని చూస్తున్నాడు. ఇక పెళ్లి వచ్చే ఏడాది చేసుకోవాలని ప్రభాస్ భావిస్తున్నాడు. ఇప్పుడు కొన్ని కారణాలతో పెళ్లి వాయిదా పడుతూ వస్తుంది. వచ్చే ఏడాది ఎలా అయినా సరే పెళ్లి చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో చేసే సినిమా అయిన తర్వాత అతను పెళ్లి మీద దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రభాస్ సినిమాలను ఒకే చేస్తున్నా పెళ్లి తర్వాతే చేస్తా అని చెప్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. 

 

ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఎక్కువగా విదేశాల్లోనే పెళ్లి చేసుకోవాలి అని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దానికి స్పష్టమైన కారణం ఏంటీ అనేది తెలియకపోయినా అతను విదేశాల్లోనే పెళ్లి చేసుకోవాలని ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు అని అంటున్నారు. అక్కడ అయితే ఎక్కువగా గోల ఉండదు అని ప్రభాస్ భావిస్తున్నాడు. ఎక్కువ హడావుడి ఉండదు ఇక జనాలు కొన్ని తప్పుడు వార్తలను రాయడం కూడా తగ్గించి ఇతర విషయాల మీద దృష్టి పెడతారని... ఇటలీ లేదా మరో దేశంలో పెళ్లి చేసుకోవాలని అతను భావిస్తున్నాడు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని వచ్చే ఏడాది మే లో అతని పెళ్లి ఉండే అవకాశం ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: