పూజా హెగ్డే.. ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. 2014 లో ముకుంద సినిమా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటి.. ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలుల అందిపుచ్చుకుంటూ  ప్రస్తుతం తెలుగులో చాలా బీజీ హీరోయిన్‌గా మ‌రిపోయింది. అయితే ఈమెకు అరవింద సమేత మొద‌టి హిట్ అని చెప్పుకోవాలి. ఆ త‌ర్వ‌త వ‌ర‌స‌గా మ‌హ‌ర్షి, గ‌ద్ద‌లకొండ గ‌ణేష్ సినిమాల‌తో మంచి మంచి హిట్లు అందుకుంటూ ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా రాణిస్తుంది. 

IHG

టాలీవుడ్‌లో ఈ టాల్‌ బ్యూటి టాప్ హీరోల అందరితోను ఆడిపాడింది.  ఇక ఇటీవ‌ల అల్లు అర్జున్ త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో మ‌ళ్లీ భారీ స‌క్సెస్‌ను అందుకుంది. ఈ సినిమాతో పూజా డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది. తెలుగులో ప్రస్తుతం ప్ర‌భాస్, రాధాకృష్ణ కుమార్ సినిమాలో నటిస్తుంది పూజా. ఈ సినిమాతో పాటు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలోనూ ఈమె హీరోయిన్. 

IHG

ఈ రెండు సినిమాలకు కూడా భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటుంది పూజా. వీటికి తోడు హిందీలో సల్మాన్‌తో పాటు అక్షయ్ సినిమాలో కూడా పూజా నటించనుంది. ఏదేమైనా పూజా మంచి జోరు మీద కొన‌సాగుతుంది. అయితే ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా ఈ బుట్ట‌బొమ్మకు షూటింగ్స్ లేక‌పోవ‌డంతో ఇంటికే ప‌రిమితం అయింది.

IHG

అయితే ఈ లాక్‌డౌన్ టైమ్ ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగించుకుంది. ఇప్ప‌టికే పూజా హెగ్డే వంటింట్లో క్యారెట్ హ‌ల్వా చేయ‌డం వంటి విష‌యాలే కాకుండా సంగీత పాఠాలు నేర్చుకుంటుంద‌ట‌. గిటార్‌లో కాస్త ప్రావీణ్య‌మున్న ఈ అమ్మ‌డు త‌న నైపుణ్యాన్ని మ‌రింత పెంచుకుంటోంద‌ట‌. అలాగే మ‌రోవైపై హాట్ హాట్ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సెగ‌లు రేపుతోంది. 

IHG

తాజాగా కూడా ఈ అమ్మ‌డు హాట్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మిచ్చాయి. పొట్టి పొట్టి బ‌ట్ట‌ల‌తో పిచ్చెక్కిస్తోంది ఈ భామ‌. అవి చూస్తుంటే నిజంగా క‌ళ్లు తిప్పుకోలేరు. మ‌రి వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: