దేశంలో నానాటీకీ పెరిగిపోతున్న కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి లాక్ డౌన్ వహిస్తున్న విషయం తెలిసిందే.  అయితే లాక్ డౌన్ కారణంగా సినీ పరిశ్రమలు షట్ డౌన్ అయ్యాయి.  దాంతో సినీ కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొంత మంది సినీ పెద్దలు.. సాంకేతిక రంగానికి చెందిన వారు.. దర్శక, నిర్మాతలు ముందుకు వస్తున్నారు.  తమకు చేతనైనంత సహాయాన్ని సిని కార్మికుల కోసం డొనేట్ చేస్తున్నారు.  తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినీ కార్మికుల కోసం విరాళం ప్రకటించింది.  

 

ఉపాధి కోల్పోయిన టాలీవుడ్ సినీ వర్కర్లకు ఆమె రూ.2 లక్షలు అందించాలని నిర్ణయించుకున్నారు. కాజల్ తన విరాళాన్ని ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ప్రారంభమైన కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి అందించనున్నారు.  సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు.. అయితే కొంత మంది మాత్రమే స్పందిస్తూ తమ విరాళాలు ఇస్తున్నారు.  ఏది ఏమైనా కష్టకాలంలో ఇలా తోటి వారికి సహాయం చేయడం మంచి విషయం అని... పేద వారిని ఆదుకోవడానికి సెలబ్రెటీలు ముందుకు రావాలని కోరకుంటున్నారు.  

 

లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలు స్థంభించిపోయాయి. చిత్ర ప్రదర్శనలు నిలిచిపోవడమే కాదు, షూటింగులు కూడా ఆగిపోయాయి. దాంతో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇళ్లకే పరిమితమయ్యారు.  దేశంలో లాక్ డౌన్ మే 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: