అసలే కరోనా మహమ్మారి బయట పొంచి ఉంది. ఇంట్లోంచి బయటకు కాలు పెడితే కాటేస్తానని అంటోంది. లాక్ డౌన్ తో ఇంట్లోనే అంతా ఉండాలని కూడా అంటున్నారు. కానీ మన టాలీవుడ్ హీరోలకు ఏమీ తోచడం లేదుట. వారికి ఎపుడూ అదే ఆలోచనట.

 

అదేంటి అంటే మాత్రం చాలా చిత్రమే. పైగా అది ఆలోచన మాత్రమే కాదు. ఆందోళన దశలోకి కూడా వెళ్ళిందట. టాలీవుడ్లో ఇపుడు అరడజన్ కి పైగా హీరోలు అర్జంట్ గా హిట్ కోసం చూస్తున్నారుట. వారికి సమ్మర్ సీజన్ బాగుంటుందని నమ్ముకున్నారుట. 

 

కానీ లాక్ డౌన్ తో సమ్మర్ దెబ్బేసింది. అలా ఇలా కాదు. మొత్తం సెలవులు తినేసింది. ఆ తరువాత సీన్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇక చూస్తే మరీ హిట్ కోసం బాగా తపించిపోతున్న హీరోలు ఎవరు అంటే వరసగా పేర్లు వస్తున్నాయి.

 

వారిలో ముందు వరసలో మాస్ మహారజా రవితేజా ఉన్నారు. ఆయన హిట్ కోసం చాలానే తపన పడుతున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ డిస్కో రాజా ఫట్ కావడం, రాజా ది గ్రేట్ తరువాత ఒక్క హిట్టూ లేకపోవడంతో ఆయన చాలా గట్టిగానే ఆశలు పెట్టుకుంటున్నారుట. ఈసారి  పెద్ద  హిట్ పడాల్సిందేనని ఆయన లేటెస్ట్ మూవీ కోసం బాగా కష్టపడుతున్నాడుట.

 

ఆయన లాగానే విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. ఆయనకు కూడా డియర్ కామ్రెడ్ దెబ్బేసింది. వరల్డ్ ఫ్యామస్ లవర్ కూడా ఫట్ అయింది. ఇపుడు చాలా అర్జంట్ గా విజయ్ కి హిట్ పడాలి. ఆయన లాగానే నాగ చైతన్య, అఖిల్, వంటి హీరోలు కూడా హిట్ కోసం చూస్తున్నారుట.

 

వీరందరూ కోటి దేవుళ్ళకు మొక్కుకుంటున్నారుట. హిట్ ఒక్కటిచ్చి ఆదుకో దేవుడా అని పెద్ద మొక్కులే మొక్కుతున్నారుట. మరి వీరి మొర ఆ దేవుడైనా ఆలకించి తొందరగా లాక్ డౌన్ ని ఎత్తివేసి కరోనా రక్కసిని పారదోలి సినిమా ధియేటర్లు తెరిపిస్తారా. ఒక్క హిట్ ఇచ్చి వీరిని మురిపిస్తారా. చూడాలి మరి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: