రష్మిక ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా టాలీవుడ్లో ఉన్న‌ హీరోయిన్ల కొరత, ఆమె లక్కూ, పైగా గ్లామర్, పెద్ద హిట్లూ అన్నీ కలసి స్టార్ ని చేసేశాయి.

 

అయితే రష్మిక సీన్ ఎంత అన్న కొత్త చర్చ ఇపుడు టాలీవుడ్లో ముందుకు రావడం విశేషం. రష్మికని నిజానికి సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ సరిలేరు నీకెవ్వరులో తీసుకోవడమే అప్పట్లో పెద్ద చర్చగా సాగింది. 

 

మహేష్ ఇమేజ్, ఆయన స్టార్ డం ముందు రష్మిక తేలిపోతుందని అంతా అనుకున్నారు. ఆ విధంగానే ఆమె మహేష్ ముందు ఎక్కడా ఆనలేదు. అక్కడికీ ఐటం సాంగ్స్ అంటూ తమన్నాని తీసుకువచ్చినా, మిగతా హంగులెన్ని కూర్చినా కూడా మహేష్ రష్మిక జంట మాత్రం ఆడియన్స్ ని పెద్దగా  ఇప్రెస్ చేయలేకపోయారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు రష్మిక ప్యాన్ ఇండినా మూవీలో  సెలెక్ట్ అయింది. అది పుష్మ మూవీ. అల్లు అర్జున్ సూపర్ స్టార్ డం తో వెలిగిపోతున్నాడు. అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ తరువాత పుష్మ పేరు తో రఫ్ఫాడించే పక్కా మాస్ క్యారక్టర్ చేస్తున్నాడు. 

 

ఆయనకు హీరోయిన్ గా రష్మికను సెలెక్ట్ చేశారు. అయితే రష్మిక ఈ బరువు మోయగలదా అంటూ అపుడే టాక్ నడుస్తోంది. రష్మిక కేవలం తెలుగు కన్నడంలో క్రేజ్ ఉన్న హీరోయిన్. మరి బన్నీకు మాలీవుడ్లో కూడా సూపర్ స్టార్ డం ఉంది. అలాగే ఫస్ట్ టైం ప్యాన్ ఇండియా మూవీగా పుష్ప లో బన్నీ నటిస్తున్నాడు.

 

అలాంటపుడు బాలీవుడ్ భామలను తీసుకువస్తే ఆ క్రేజే వేరుగా ఉంటుందని అంటున్నారు. కానీ డైరెక్టర్ సుకుమార్ మాత్రం రష్మికనే ఎందుకో సెలెక్ట్ చేశాడు. అయితే ఆమె పాత్ర ఈ మూవీలో గిర్జిజన యువతి గా ఉంటుందిట. మంచి ట్విస్టులతో తో సాగుతుందిట. దాంతో రష్మిక కరెక్టేనని మూవీ చూస్తే అందరూ ఒప్పుకుంటారని చిత్ర యూనిట్ అంటోంది.

 

మొత్తానికి రష్మిక మాత్రం తొందరలొనే ప్యాన్ ఇండియా మూవీ చేసేస్తోంది.  వెరీ గుడ్  బెటర్మెంట్స్ అంటూ కుళ్ళుకుంటున్నారు సాటి హీరోయిన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: