కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు . 

 

 

ఇకపోతే కరోనా కారణంగా బాధపడుతున్న పేదలను ఆదుకోవడానికి స్వంచంధ సంస్థలు ముందుకొస్తున్నాయి.. దాంతో పాటుగా సినీ రాజకీయ ప్రముఖులు అభిమానుల కూడా ఎక్కడిక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.  ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలోని చాలా మంది పేదలకు అన్నదానం అందజేస్తూ వస్తున్నారు.. మరీ కొందరు సోషల్ మీడియాలో చురుకుగా పాల్గొంటూ జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.  

 

 

కరోనా పై పోరాటానికి ప్రజలు సిద్దం కావాలని సినీ ప్రముఖులు ఉత్తేజ పరుస్తున్నారు.. వీడియోల ద్వారా జాగ్రత్తలు తెలిపితే మరీ కొందరు మాత్రం రకరకాలా వీడియో నుపొస్ట్ చేస్తూ అభిమానులకు కావలసిన ఉత్తేజాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు..ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీలు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకొస్తున్నారు.. పలుగురు విరాళాలను అందిస్తున్నారు.. మరికొంత మంది స్వయంగా వచ్చి ప్రజలకు కావలసిన అత్యవసర నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు.. 

 

 

 

తాజాగా హీరో శ్రీకాంత్ , మినిస్టర్ తో కలిసి మరీ ప్రజలకు సేవ చేస్తూ వస్తున్నారు.. గతంలో పేదల ఆకలిని తీర్చడానికి ముందుకొస్తున్నారు దాతలు సాయంతో 1000 మందికి పై అన్నదానం చేశారు .. ఇప్పుడు ప్రజలకు మాస్కులను అందజేశారు.. అంతేకాదు కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి తెలుగు గాయని గాయకులు పాడిన పాటలు హీరో శ్రీకాంత్ విడుదల చేశారు.. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతూ వస్తున్నాయి.. కరోనా పూర్తయ్యేవరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు . 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: