కరోనా వల్ల ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మార్చి 23 నుండి దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ, రోజు రోజుకి కరోనా కేసులు ఎక్కువవడంతో పరిస్థితి మెరుగుపడటం కోసం లాక్ డౌన్ ఒక్కటే కరెక్ట్ అని.. మళ్ళీ 19 రోజుల పాటు అంటే మే 3 వరకు లాక్ డౌన్ పొడిగించారు. అయితే లాక్ డౌన్ టైం లో ఇంట్లో ఉంటున్న వారు బోర్ ఫీల్ అవకుండా ఆన్ లైన్ మీద పడుతున్నారు. ఇప్పటికే అమెజాన్, నెట్ ఫ్లిక్స్, సన్ నెక్స్ట్, ఆహా యాప్ లు బాగా చూస్తున్నారు. 

 

ఇక కరోనా టైం లో యూట్యూబ్ లో నచ్చిన పాటలను నచ్చినన్ని సార్లు చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు. ఇందులో భాగనగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని దిమాక్ ఖరాబ్ సాంగ్ సెన్సేషన్ గా మారింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ తో క్రేజీ రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ సాంగ్ లో నిధి అగర్వాల్, నభా నటేష్ ఇద్దరు తమ అందాలతో రెచ్చిపోయారు. మాస్ ఆడియెన్స్ కు ఈ సాంగ్ విపరీతంగా నచ్చేసింది. 

 

సినిమా రిలీజై హిట్ అయ్యాక ఈ సాంగ్ అఫీషియల్ వీడియో కోసం ఎంతగానో ఎదురుచూశారు. వచ్చినప్పటి ఉంది సాంగ్ ను రిపీటెడ్ మోడ్ లో చూస్తున్నారు. ఇప్పుడు ఏకంగా 100 మిలియన్ మార్క్ తో దుమ్ముదులిపేసింది. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఇస్మార్ట్ శంకర్ మ్యూజిక్ పరంగా కూడా సూపర్ హిట్ అయ్యింది. రామ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా ఈ సినిమా పూరీని తిరిగి ఫామ్ లోకి తెచ్చింది. ఇస్మార్ట్ శంకర్ తో స్మార్ట్ హిట్ అందుకున్న రామ్సినిమా తర్వాత రెడ్ మూవీ చేస్తున్నాడు. కిషోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మురళి శర్మ, అమృత అయ్యర్, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: