ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ పేరుకు ఇంట్ర‌డ‌క్ష‌న్ అవ‌స‌రం లేదు. చిరంజీవి త‌మ్ముడుగా ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టి వ‌రుస‌గా హిట్లు కొట్టి ఎంతో మంది అభిమానుల‌ను సంహ‌రించుకున్నాడు. అప‌జ‌యాలు ఎన్ని ఎదుర‌యినా ఆయ‌న‌ను అభిమానులు మాత్రం వ‌దిలి వెళ్ళ‌లేదు. ప‌వ‌న్‌కి చిన్న‌ప్ప‌టి నుంచి కూడా చ‌దువు మీద పెద్ద‌గా ఆశ ఉండేది కాద‌ట‌. నెల్లూరులో త‌న స్కూలింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నారు. త‌ర్వాత ఇంట‌ర్మీడియ‌ట్ కూడా నెల్లూరులోనే వి.ఆర్‌. క‌ళాశాల‌లో పూర్తి చేశాడు. ఆ త‌ర్వాత కంప్యూట‌ర్స్‌లో డిప్ల‌మా చేశాడు. ప‌వ‌న్‌కి వాళ్ళ వ‌దిన సురేఖ అంటే  చాలా ఇష్ట‌మ‌ట‌. ఎందుకంటే సురేఖ ప‌వ‌న్‌ను చాలా బాగా చూసుకునేద‌ట‌. రాజ‌కియంగా అన్న‌ను విబేధించిన‌ప్ప‌టికీ తెర మీద మాత్రం అన్న‌య్య మీద ప్రేమ కురిపిస్తూ ఉంటాడు.

 

అన్న కొడుకు చ‌ర‌ణ్ అన్నా కూడా చాలా ఇష్టం. ప‌వ‌న్‌కి 1997లో నందిని  అనే వైజాగ్ అమ్మాయితో వివాహం జ‌రిగింది.  నందినికి ఐదుకోట్లు భ‌ర‌ణంగా ఇచ్చి ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్నారు.ఆ త‌ర్వాత బ‌ద్రి చిత్రంలో ఆయ‌న‌తో కలిసి న‌టించిన రేణుదేశాయ్‌ని వివాహం చేసుకున్నారు. ఇక రేణుదేశాయ్‌, ప‌వ‌న్‌ల‌కు పుట్టిన బాబు పేరు అఖిరా నంద‌న్ పెట్టారు. ప్ర‌ఖ్యాత జ‌ప‌నీస్ ద‌ర్శ‌కుడు అఖిరాకురుస‌వ పై అభిమానంతో వారు త‌మ కొడుకుకు ఆ పేరు పెట్టుకున్నారు. అత‌నికి ఆయ‌న రాసిన బుక్స్‌, పెయింటింగ్స్ ఇవ‌న్నీ న‌చ్చి అలాగే ఆయ‌న ఆద‌ర్శ‌వంత‌మైన కొన్ని ప‌నుల‌ను తీసుకుని ఆయ‌న్ని ఆద‌ర్శంగా భావించి ఆయ‌న పేరు పెట్ట‌డం జ‌రిగింది. అంటే ఒక వ్య‌క్తి మీద ఎంత అభిమానం ఉంటే అలా ఆయ‌న పేరుని త‌మ పిల్ల‌ల‌కు పెట్టుకుంటారు అన్న‌ది మ‌నం ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం.

 

ఇక‌ ప‌ద‌కొండు సంవ‌త్స‌రాల పాటు ప‌వ‌న్‌,రేణు క‌లిసి  జీవించారు. త‌ర్వాత బేదాభిప్రాయాలు వ‌చ్చి వీరిద్ద‌రూ విడిపోవ‌డం జ‌రిగింది. వీరిద్ద‌రికి అఖిరా, ఆద్యా అని ఇద్ద‌రు పిల్లలున్నారు. త‌మ మ‌ధ్య ఎటువంటి బేధాభిప్రాయాలు లేవ‌ని తాము సామాజిక దృక్ప‌ధంతోనే విడిపోయామ‌ని రేణు దేశాయ్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: