కన్నడ భామ రష్మిక మందన్న ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో ఆమె ఒక గిరిజన యువతిగా కనపడనున్నట్లు టాక్. ఇకపోతే ఇటీవల ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టి, దానితో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు క్రేజ్ ని అమాంతం పెంచేసుకున్న రష్మిక కు తెలుగులో విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. మొదటగా నాగ శౌర్య హీరోగా వచ్చిన ఛలో సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక, ఫస్ట్ మూవీ తోనే మంచి హిట్ అందుకుని ప్రేక్షకుల మదిలో మంచి స్థానాన్ని సంపాదించింది. 

 

ఆపై విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందంలో నటించిన ఆ సినిమా సూపర్ సక్సెస్ తో ఎంతో గొప్ప పేరు సంపాదించింది. ఇక ప్రస్తుతం బన్నీ సినిమాతో పాటు పలు తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటిస్తున్న రష్మిక ఎక్కువగా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులతో తన వ్యక్తిగత, సినీ విశేషాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ ల పోస్ట్ లు పెట్టె సమయంలో ఎక్కువగా కోతి బొమ్మలతో కూడిన ఎమోజీలను పెడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో దర్శకుడు వెంకీ కుడుముల, దర్శకుడు దేవిశ్రీ కూడా చెప్పి సరదాగా ఆమెను ఆటపట్టించడం జరిగింది. వాస్తవానికి అలా ఆమె దాదాపుగా చాలా పోస్ట్ లకు కోతి ఎమోజిలను పోస్ట్ చేయడంపై కొందరు అభిమానులు ఆమెపై విమర్శలు కూడా చేసారు. 

 

ఒక పెద్ద హీరోయిన్ రేంజ్ లో ఉన్న మీరు, ఈ విధంగా కోతి చేష్టలు చేస్తూ పోస్టులు పెట్టడం సరికాదని ఆమెపై కామెంట్స్ చేయడం జరిగింది. అయితే తనను తానే ఒక కోతిగా భావించి సరదాగా కోతి ఎమోజీలు పెడుతుంటానే తప్ప, మరొకరిని కించపరచాలని కాదని ఇటీవల దానిపై రష్మిక వివరణ ఇచ్చారు. ఇకపోతే నేడు కాసేపటి క్రితం రష్మిక పెట్టిన పోస్ట్ పై ఆమె అభిమానులు పాజిటివ్ గా ట్వీట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం అందరం కూడా ఈ మహమ్మారి కరోనా వలన ఎంతో కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం, చీకట్లను తరిమికొట్టి వెలుగును అందరం కలిసి నింపాల్సిన సమయం ఇది. ఈ సమయంలో తోటి వారు బాధల్లో ఉంటె మీ వంతుగా సహాయపడండి అంటూ హుందాగా కోతి ఎమోజీలు లేకుండా, దీపం, ప్రేమ ఎమోజిలతో రష్మిక ట్వీట్ చేయడంతో, మొదటి సారి నీస్థాయి, హోదాకి తగ్గ ట్వీట్ చేసావు అంటూ పొగుడుతూ పలువురు ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: