భీభత్సం సినిమాతో టాలీవుడ్ కి సంగీత దర్శకుడిగా అడుగుపెట్టిన ఎస్ ఎస్ థమన్, ఆ తరువాత రవితేజ, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన కిక్ సినిమాకు అదిరిపోయే సంగీతం అందించి మంచి పేరు దక్కించుకున్నాడు. ఇక ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ దూకుడు, ఎన్టీఆర్ బృందావనం వంటి సూపర్ హిట్ సినిమాలకు మంచి సంగీతం అందించిన థమన్, ఆపై పలువురు పెద్ద నటులతో పాటు కొందరు చిన్న నటుల సినిమాలకు కూడా మ్యూజిక్ అందించడం జరిగింది. కాగా తెలుగుతో పాటు అటు తమిళ్ లో కూడా పలు సినిమాలకు మంచి మ్యూజిక్ ఇచ్చిన థమన్ పై అప్పట్లో కాపీ ట్యూన్స్ ఇస్తాడు అనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వాటిని పెద్దగా లక్ష్య పెట్టని థమన్, తన పనిని తాను చేసుకుంటూ వెళ్లేవారు. 

 

ఇక ఆ తరువాత థమన్ సాంగ్స్ లో మునుపటి క్వాలిటీ లేదనే విమర్శలు మొదలవడంతో పాటు ఆయన మ్యూజిక్ అందించిన కొన్ని సినిమాలు అప్పట్లో ఫ్లాప్ కావడంతో థమన్ కు కొంత లోలోపల ఆవేదన కలిగి, కొన్నాళ్లపాటు సినిమా రంగానికి దూరంగా ఉన్నాడు. ఆపై కొద్దిపాటి గ్యాప్ తరువాత మళ్ళి మహానుభావుడు తో ఎంట్రీ ఇచ్చిన థమన్, ఆ సినిమాకు అదిరిపోయే ట్యూన్స్ అందించాడు. అనంతరం వరుణ్ తేజ్, రాశి ఖన్నాల కలయికలో వచ్చిన తొలిప్రేమకు థమన్ అందించిన సాంగ్స్ అప్పట్లో పెద్ద చాట్ బస్టర్ గా నిలిచాయి. ఇక అక్కడి నుండి మెల్లగా తన హవాను కొనసాగిస్తూ వచ్చిన థమన్, ఇటీవల అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అలవైకుంఠపురములో సినిమాకు ఇచ్చిన సాంగ్స్ దేశవ్యాప్తంగా విపరీతమైన సంచలనాన్ని సృష్టించడంతో పాటు యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ ని దక్కించుకోవడం జరిగింది. 

 

అలానే ఆ సినిమా కూడా పెద్ద హిట్ కొట్టడంతో ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు థమన్. అయితే థమన్ ఈ క్రేజ్ ని ఎంతవరకు నిలబెట్టుకుంటాడు అనే దానిపై టాలీవుడ్ లో పలు చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం చేతిలో కొన్ని సినెమాలత్ పాటు, ఇటీవల ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఛాన్స్ ని కూడా దక్కించుకున్న థమన్ కు రాబోయే రోజుల్లో చాలా ఛాన్స్ లు రానున్నట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమాలకు కూడా అల రేంజ్ లోనే అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వగలడా, మరీ ముఖ్యంగా అందరూ అంటోంది ఏంటంటే, అల సినిమాతో ఒక్కసారిగా అంతగొప్ప పేరు రావడం ఒక మంచి వరం లాంటిదని, అయితే దానిని సరిగ్గా వినియోగించుకోకపోతే మాత్రం అదే థమన్ కు శాపం గా కూడా మారి కాటేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇకపై రాబోయే తన తదుపరి సినిమాలకు థమన్ ఏ రేంజ్ లో మ్యూజిక్ ఇస్తాడో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: