టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా వస్తుందంటే అంచనాలు ఓ రేంజ్ ఓ ఉంటున్నాయి. రీసెంట్ గా మొన్న సంక్రాంతికి అల.. వైకుంఠపురములో సినిమాతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టిన బన్నీ తన నెక్స్ట్ ప్రాజెక్టును ఏకంగా పాన్ ఇండియన్ సబ్జెక్టును చేస్తున్నాడు. క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన మెయిన్ హీరోయిన్ కాగా.. సెకండ్ హీరోయిన్ కు కూడా చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

 

 

ఆల్రెడీ షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నివేదా పేతురాజ్ తీసుకున్నారని తెలుస్తోంది. బన్నీ అల.. వైకుంఠపురములో సినిమాలో కూడా మెరిసిన ఈ భామ తన గ్లామర్ లుక్స్ తో ఆడియన్స్ ను మెప్పించింది. పుష్పలో బన్నీకి సెకండ్ హీరోయిన్ పాత్రకు కూడా ఇంపార్టెన్స్ ఉందని తెలుస్తోంది. దీంతో ఈ క్యారెక్టర్ కు నివేదా పేరును సుకుమార్ కు బన్నీనే ప్రపోజ్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో రౌండ్ అవుతున్న ఈ వార్తపై పూర్తి అఫిషియల్ న్యూస్ టీమ్ నుంచి రావాల్సి ఉంది.

 

 

బన్నీ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా అంటే ప్రీవియస్ తన సినిమాల్లో చేసిన వారికే రెండో అవకాశం ఇస్తూంటాడు. ఇద్దరమ్మాయిలతో సినిమాలో చేసిన కేథరిన్ ను సరైనోడు లో కూడా తీసుకున్నాడు. ఇప్పుడు అల.. సినిమాలో చేసిన నివేదా కనుక పుష్పలో ఫైనల్ అయితే బన్నీ తన మునుపటి హీరోయిన్లకు మలి అవకాశం ఇస్తున్నట్టే లెక్క. నివేదా తన గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. బన్నీకి మళయాళంలో కూడా క్రేజ్ ఉండటంతో కథతో పాటు హీరోయిన్ సెలక్షన్ కు ఫుల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: