సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. కన్నడ బ్యూటి రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ తో పాటు అల్లు అర్జున్ లుక్ ని కూడా రివీల్ చేశారు. ఇక పుష్ప సినిమా పాన్ ఇండియ రేంజ్ లో తెరకెక్కుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మళయాల భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. మరోసారి సుకుమార్ అల్లు అర్జున్ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కలిసి మ్యాజిక్ చేయబోతున్నారు. 

 

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సుకుమార్ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసందే. లేదంటే ఈపాటికే కొంత టాకీ పార్ట్ కంప్లీట్ అయ్యేదని సమాచారం. అయితే ఇప్పుడు సుకుమార్సినిమా విషయంలో ఒత్తిడి ఎక్కువవుతుందని అంటున్నారు. పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కుతుంది కాబట్టి గత సంక్రాంతి కి వచ్చిన బ్లాక్ బస్టర్ అయిన అల వైకుంఠపురములో మ్యాజిక్ ని మరోసారి రిపీట్ అయ్యోలా 2021 సంక్రాంతికి టార్గెట్ పెట్టుకొని సినిమాని కంప్లీట్ చేయమని నిర్మాతలు అంటున్నారట. అయితే ఇప్పటికే 2021 సంక్రాంతికి కొన్ని పెద్ద సినిమాలు రెడీ అవుతున్నాయి. 

 

ఆర్.ఆర్.ఆర్ తో పాటు ఆచార్య, అలాగే రాధే శ్యాం, వెంకటేష్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న నారప్ప ..ఇలా పెద్ద సినిమా రిలీజ్ కి సిద్దం కానున్నాయట. ఇది తెలిసి కూడా పుష్ప ని సంక్రాంతి కి రిలీజ్ చేద్దామని నిర్మాతలు అంటున్నారట. అయితే ఈ సినిమా షూటింగ్ కి చాలా సమయం పడుతుందని నన్ను ఏమాత్రం తొందరపెట్ట వద్దని సుకుమార్ తేల్చి చెప్పారట.

 

అందుకు కారణం ఈ సినిమా ఎక్కువ భాగం ఫారెస్ట్ బ్యాగ్ డ్రాప్ లో తెరకెక్కించాలి. ఇక్కడే చాలా సమయం పడుతుంది. ఏదో హడావుడిగా చేస్తే మాత్రం క్వాలిటీ రాదని నిర్మొహమాటంగా చెప్పారట. అంతేకాదు మిగతా సినిమాలతో పోటీ పడి తొందరపడితే సినిమా రిజల్ట్ ఊహించలేమని ఆ తర్వాత బాధ్యత నాది కాదు అన్నారట. అంతే కదా లేదంటే రంగస్థలం అంత సక్సస్ ఎలా అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: