టాలీవుడ్ లో మెగాస్టార్ సినిమా ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తారు. మెగా మూవీలో మెగాస్టార్ పక్కన ఛాన్స్ పెట్టేస్తే ఇక తెలుగులో ఫామ్ కొనసాగించే అవకాశం ఉంటుంది. అయితే ఆ ఛాన్స్ వచ్చినా తనంతట తానె కాలదన్నుకుంది త్రిష. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు తన హవా కొనసాగిస్తున్న త్రిష ఇప్పుడు మళ్ళీ తమిళంలో వరుస సినిమాలు చేస్తుంది. తెలుగులో కూడా ఆమె నటించాలని అనుకుంటుంది. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ మూవీలో ఛాన్స్ అందుకున్న త్రిష ఆ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చింది. 


మణిరత్నం సినిమా ఉండటం వల్ల డేట్స్ క్లాష్ అవుతున్నాయని త్రిష మెగాస్టార్ ఆచర్య నుండి బయటకు వెళ్లిందని అన్నారు. కాని అసలు కారణం అది కాదని తెలుస్తుంది. ఆచార్యా యూనిట్ బిహేవియర్ నచ్చకనే త్రిషసినిమా నుండి ఎగ్జిట్ అయ్యిందట. అదేంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్ ను బాగానే చూసుకుంటారు కదా.. తెలుగు ఫిల్మ్ మేకర్స్ మీద మిగతా భాషల తారలు మంచి కామెంట్స్ చేస్తారు. అలాంటిది త్రిష ఎందుకు అలా ఫీల్ అయిందో అంటున్నారు. 


ఆచార్య నుండి త్రిష ఎగ్జిట్ అవడానికి మణిరత్నం సినిమా కాదట.. యూనిట్ సభ్యులతో త్రిష కంఫర్ట్ గా ఫీల్ అవలేదట. అందుకే ఆ ప్రాజెక్ట్ నుండి చెప్పాపెట్టకుండా బయటకు వచ్చేసింది. త్రిష తీసుకున్న ఈ నిర్ణయాన్ని చిత్రయూనిట్ స్వాగతించింది. ఆమె ప్లేస్ లో కాజల్ ను ఫైనల్ చేసింది. ఈమధ్య తెలుగు సినిమాలు చేయని త్రిష ఇక్కడ యూనిట్ మెంబర్స్ తో మింగిల్ అవలేకనే మెగాస్టార్ ఛాన్స్ వదిలేసింది అంటున్నారు. ఇదివరకు తెలుగులో చేసినప్పుడు రాని ఏ ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు వచ్చిందో ఆమెకే తెలియాలి. మొత్తానికి త్రిష కాదన్నా ఆ ఛాన్స్ అందుకుంది కాజల్.   

మరింత సమాచారం తెలుసుకోండి: