కరోనా సెలబ్రిటీల్లోకి సరికొత్త టాలెంట్‌ను బయటకు తీసుకువస్తోంది. ఇన్నాళ్లు షూటింగ్ లు యాక్టింగ్ లతో బిజీగా ఉన్న తారలు ఇప్పుడు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటి పట్టునే ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపే అవకాశం రావటంతో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి పనుల్లో భాగం పంచుకుంటున్నారు. ఈ లిస్ట్ కు మెగా స్టార్ లు, సూపర్‌ స్టార్లు కూడా అతీతమేం కాదు.

 

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల ఓ ఆసక్తికర వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రామ్ చరణ్ వంట చేస్తున్న వీడియోను తన పేజ్‌లో షేర్ చేసిన ఉపాసన, మిస్టర్‌ సీ తన భార్య కోసం వంట చేస్తున్నాడు అంటూ కామెంట్ చేసింది. తన భార్య కోసం నల భీముడుగా మారిన చరణ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యింది.

 

ఇక సినిమాల విషయానికి వస్తే చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమా పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు లాక్‌ డౌన్‌ కారణంగా బ్రేక్ పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: