కరోనా వైరస్ లాక్ డౌన్ సమయాన్ని చిరంజీవి చలా సమర్ధవంతంగా విని వినియోగించుకుంటున్నాడు. ఒకవైపు క్రమం తప్పకుండా జిమ్ చేస్తూ  చిరంజీవి బాడీ తగ్గించి మంచి షేప్ లోకి వచ్చే ప్రయత్నంచేస్తున్నాడు. అదేవిధంగా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆగిపోయిన  ‘ఆచార్య’ ను ఏవిదంగా వీలైంత త్వరలో  పూర్తిచేయాలి అన్న ఆలోచనలు కూడ చేస్తున్నాడు.  


మరోవైపు కష్టాల్లో ఉన్న సినీ కార్మికుల కోసం నిధుల సమీకరణ చేసి కరోనా క్రైసిస్ ఛారిటీ కార్యక్రమాలను కూడ చిరంజీవి పర్యవేక్షిస్తున్నాడు. ఇది కాకుండా  తన ఆత్మకథ విషయమై చిరంజీవి గట్టి ఆలోచనలు చేస్తుతన భార్య సురేఖతో కలిసి కొన్ని వీడియోలు కూడ రికార్డ్ చేస్తున్నాడు. 


ప్రతిరోజు తన విలాస వంతమైన ఇంటిలో ఉన్న గార్డెన్ లో మొక్కలకు నీళ్ళు పోస్తూ కాలుష్య రహితమైన భాగ్యనగరాన్ని చూసి ఆనందపడుతున్నాడు. ఈ మధ్యనే సోషల్ మీడియాలోకి రావడమే కాకుండా రోజుకు కనీసం తనవైపు నుండి 5 ట్విట్స్ ఉండేలా చూసుకుంటూ ఈ విషయంలో కూడ చిరంజీవి అందరికి సవాల్ విసురుతున్నాడు.   


ఈ మధ్య చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను నిరంతరం ఏదో ఒకటి నేర్చుకోవడానికే ఇష్టపడతాను అంటూ తన ఆలోచనలకు ఈ లాక్ డౌన్ పీరియడ్ ఎంతగానో సహకరిస్తున్న విషయం తెలియచేసాడు. అంతేకాదు తనకు ఎప్పటినుంచో  కొత్త భాషలను నేర్చుకోవాలనే కోరిక ఉందని తన మనవరాళ్ళు స్పానిష్ గలగలా మాట్లాడటం చూసి తాను ఆశ్చర్యపోవడమే కాకుండా రోజుకు కనీసం నాలుగుపదాలు ప్రస్తుతం తాను తన మనవరాళ్ళ వద్ద నేర్చుకుంటున్న విషయం బయటపెట్టాడు.   అంతేకాదు ఈ లాక్ డౌన్ పీరియడ్ అయిపోయిన తరువాత తాను స్పానిష్ భాషలో మరింత ప్రావీణ్యం పెంచుకోవడానికి ఒక ట్యూటర్ ను కూడ పెట్టుకోబోతున్న విషయం వివరిస్తూ తాను ఏ పని మొదలుపెట్టినా ఎంత ధృఢ నిశ్చయంతో చేస్తాడో వివరించాడు. అందుకే పట్టుదల విషయంలో ఎంతమంది యంగ్ హీరోలు వచ్చినా 64 సంవత్సరాల చిరంజీవి ని డామినేట్ చేయలేకపోతున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: