టాలీవుడ్ లో ఇప్పుడు జగపతి బాబు హవా ఎక్కువగానే నడుస్తుంది. టాలీవుడ్ జనాలు జగపతి బాబు ని ఎక్కువగానే అభిమానిస్తున్నారు. ఆయన విలన్ అయితే చాలు ఇనిమా సూపర్ హిట్ అనే భావనలో ఉన్నారు కొందరు. దర్శకులు కూడా జగపతి బాబు కోసం ఎక్కువగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకుని చేస్తున్నారు. ఆఫర్లు ఎక్కువగా విలన్ కే వస్తున్నాయి. ఎప్పుడు అదే విధంగా చేస్తే ఇబ్బంది అని భావించి జాగ్రత్తగా ఇతర పాత్రలను కూడా ఆయన ఎంపిక చేసుకుంటున్నారు అని అంటున్నారు. 

 

దీనికి కారణం ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఉండటమే అని అంటున్నారు. టాలీవుడ్ లో ఆయనకు భారీగా ఇప్పుడు ఆఫర్లు వస్తున్నాయి. ఇక బాలీవుడ్ లో కూడా ఆయనకు మంచి డిమాండ్ ఉందని సమాచారం. బాలీవుడ్ లో కొందరు హీరోలు ఆయన తో సినిమా చేయడానికి గాను ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో సల్మాన్ ఖాన్ ఒకరు. సల్మాన్ ఖాన్ కి జగ్గు భాయ్ ఫాలోయింగ్ అర్ధమైంది అని అది తెలుగు మార్కెట్ కి బాగా ఉపయోగ పడే అవకాశం ఉంటుంది అని భావించి ఇక్కడి  జగపతి బాబు ని తీసుకుని వెళ్తున్నారు అంటున్నారు. 

 

పెద్ద హీరో అయినా సరే జగపతి బాబు తో సినిమా చేయడం తనకు ఇక్కడ బాగా ఉపయోగపడే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. త్వరలోనే తాను చేయబోయే సినిమాలో జగ్గు భాయ్ ని తీసుకునే సూచనలు కనపడుతున్నాయి. ఇది ఎంత వరకు నిజం అనేది చూడాలి అంటే కొంత కాలం ఎదురు చూడాలి. ప్రస్తుతం జగపతి బాబు మూడు సినిమాల్లో చేస్తున్నారు. సల్మాన్ సినిమాలో ఆయనకు విలన్ గా ఆఫర్ వచ్చినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: