ప్ర‌స్తుతం తెలుగులో అంతా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ న‌డుస్తోంది. సాహో, సైరా అంత‌కు ముందు బాహుబ‌లి సినిమాల దెబ్బ‌తో చాలా మంది హీరోలు త‌మ మార్కెట్ పెంచుకునే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కూడా తమ నెక్ట్ ప్రాజెక్ట్స్ పాన్ ఇండియా చిత్రాలుగా విడుదల చేయునున్నారు. బన్నీ-సుకుమార్ పుష్ప పాన్ ఇండియా సినిమాగా ఐదు భాష‌ల్లో రిలీజ్ కానుంది. ఇక అల వైకుంఠ‌పురంలో సినిమా హిట్‌తో బ‌న్నీ ఇండియా మార్కెట్‌పై కాన్‌సంట్రేష‌న్ చేశాడు.

 

ఇక ప‌వ‌న్ , క్రిష్‌తో చేసే పీరియాడిక‌ల్ సినిమాను సైతం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. మొఘలుల ఎంఫైర్ కి సవాల్ విసిరే బందిపోటుగా పవన్ కనిపించనుండగా పాన్ ఇండియా స్టోరీ కావడంతో హిందీలో కూడా విడుదల చేస్తున్నార‌ట‌. అయితే వీరు హిందీలో హిట్ కొట్ట‌డం అంత వీజీ కాదు. సైరా అక్క‌డ డిజాస్ట‌ర్ అయ్యింది.

 

అయితే ఆర్.ఆర్.ఆర్ సినిమా తెలుగు వీరుల కథతో తెరకెక్కుతున్నా.. ఫిక్షనల్ స్టోరీ కావడం, రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ ఆ సినిమాకు అడ్వాంటేజ్. ఇక బాహుబ‌లి, సాహో మాత్రం బాలీవుడ్ వాళ్ల‌ను మెప్పించాయి. ఈ లెక్క‌న చూస్తే పుష్ప‌, ప‌వ‌న్ సినిమాల‌కు బాలీవుడ్లో, మిగిలిన భాష‌ల్లో హిట్ కొట్ట‌డం క‌ఠిన ప‌రీక్షే. రిజ‌ల్ట్ ఏ మాత్రం తేడా వ‌చ్చినా అది ప‌రువు పోయిన‌ట్టే అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: