పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగానే కాదు రైటర్ గా, దర్శకుడిగా కూడా తన ప్రతిభ కనబరిచారు.  పవన్ కళ్యాణ్ డైరక్షన్ చేసిన మొదటి సినిమా జానీ. ఆ సినిమా నిరాశపరచడంతో మళ్ళీ డైరక్షన్ జోలికి వెళ్లడని అనుకున్నారు కానీ మూడేళ్ళ గ్యాప్ ఇచ్చి  అంటే 2006లో సత్యాగ్రహి అనే సినిమా మొదలుపెట్టాడు పవన్ కళ్యాణ్. సామాజిక అంశాలతో కూడిన కథతో ఈ సినిమా తీయాలని అనుకున్నాడు పవన్ కళ్యాణ్. సత్యాగ్రహి సినిమా అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా లాంచ్ అయ్యింది. 

 

దాసరి నారాయణ రావు, వెంకటేష్, అల్లు అర్జున్, నితిన్ పవన్ సత్యగ్రహి సినిమా ఓపెనింగ్ కు అటెండ్ అయ్యారు. పవన్ కథ, స్క్రీన్,డైరక్షన్ అందించాలని అనుకున్న ఈ సినిమా ఓపెనింగ్ అయితే అయింది కానీ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఏ.ఎం.రత్నం నిర్మితగా ఎనౌన్స్ చేయగా ఎందుకో ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకున్న పవన్సినిమా విషయంలో ఎందుకు వెనక్కి తగ్గాడా ఎవరికీ తెలియదు. 

 

తను ఏం చేయాలనుకున్నా సరే చేసి చూపించే పవన్ కళ్యాణ్ సత్యాగ్రహి సినిమా విషయంలో మాత్రం ముందడుగు వేయలేకపోయాడు. పవన్సినిమా చేయడం మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదన్న టాక్ కూడా అప్పట్లో వినపడ్డది. సత్యాగ్రహి ఓపెనింగ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి అటెండ్ అవలేదు. ఈవెంట్ లో భాగంగా పవన్ అన్నయ్య చిరంజీవి చెన్నై వెళ్లారు అందుకే ఈ కార్యక్రమానికి రాలేదని చెప్పారు. హీరోగా మంచి క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ డైరక్షన్ చేయడం మెగా ఫ్యామిలీకి ఏమాత్రం ఇష్టం లేదు. అదీగాక పవన్ చేసిన జాని ప్లాప్ అయ్యింది. అందుకే మెగా ఫ్యామిలీ ఆ ప్రాజెక్ట్ పై అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. అయితే కొన్ని కారణాల వల్ల పవన్ కూడా సత్యగ్రహిని పక్కన పెట్టాల్సి వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: