కింగ్ నాగార్జున - కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన సోగ్గాడే చిన్నినాయన ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమా కు ఇప్పుడు సీక్వెల్ రానుంది. స్క్రిప్ వర్క్  కూడా పూర్తి కాగా ఆగస్టు నుండి సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. బంగార్రాజు అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నాగార్జున తోపాటు నాగచైతన్య ,రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. 

 
ఇక  ప్రస్తుతం నాగ్, సాల్మోన్ డైరెక్షన్ లో వైల్డ్ డాగ్ లో నటిస్తున్నాడు. సాంగ్స్ లేకుండా రియాలిస్టిక్ గా  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున , విజయ్ వర్మ అనే ఎన్ ఐ ఏ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిరంజన్ రెడ్డి , అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదలకానుంది. ఈసినిమా పై నాగార్జున భారీ ఆశలు పెట్టుకున్నాడు. 
 
ఇదిలావుంటే గత కొంత కాలంగా ఈ హీరో కి ఏ మాత్రం కలిసి రావడం లేదు.  2018లో ఆఫీసర్ రూపంలో కెరీర్ లోనే అత్యంత చెత్త సినిమా చేసిన నాగ్ .. ఆతరువాత  మల్టీ స్టారర్  దేవదాస్ తో వచ్చినా.. ఆసినిమా యావరేజ్ తో సరిపెట్టుకుంది. ఇక గత ఏడాది మన్మథుడు 2 తో  నాగ్ మరో భారీ డిజాస్టర్ ను చవిచుశాడు. మరి వైల్డ్ డాగ్ తో నైనా నాగ్  సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: