ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా భూతాన్ని తరిమి కొట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.  చిన్న దేశం నుంచి మొదలు అగ్ర రాజ్యాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది కరోనా.  చైనాలో పుట్టుకొచ్చిన ఈ కరోనా భూతం ఇప్పుడు ప్రపంచాన్ని నిద్రపట్టకుండా చేస్తుంది.  ప్రతిరోజూ మరణ వార్తలు వింటూనే ఉన్నాం. అమెరికా లాంటి అగ్ర రాజ్యాల్లో ఈ కరోనా కరాళ నృత్యం చేస్తుంది.  కరోనాని అరికట్టడానికి మనిషి ఇప్పుడు తనను తాను కాపాడుకోవడమే.. ఎందుకంటే దీనికి ఇంకా యాంటీ డోస్ రాలేదు.  దాంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రక రకాల మాద్యమాల ద్వారా సెలబ్రెటీలు వీడియోలు పంపుతున్నారు.  

 

కరోనాని తరిమికొట్టేందుకు ఎంతో మంది కళాకారులుముందుకు వస్తున్నారు.  కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.. కరోనా వస్తే ఎం చేయాలి అనే విషయంపై అవగాహన కల్పిస్తున్నారు.  కరోనా మహమ్మారిగా మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సినీ ప్రముఖులందరూ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.  తాజాగా జనసేన పార్టీ తరఫున ఓ ర్యాప్ సాంగ్ బయటకు వచ్చింది. `గబ్బర్ సింగ్` సినిమా నటులు కొందరు ఈ పాటలో కనిపించారు.  

 

అప్పట్లో గబ్బర్ సింగ్ మూవీలో రౌడీలో పవన్ కళ్యాక్ అంత్యాక్షరి కామెడీ సీన్ ఎంత పాపులారిటీ సంపాదించిందో అందరికీ తెలిసిందే.  మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ కోటి స్వరపరిచిన ఈ పాటను గీత రచయిత ప్రియాంక రాశారు. మేఘారాజ్ ఆలపించారు. ఈ బృందానికి పవన్ కల్యాణ్ ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు. గబ్బర్ సింగ్` సినిమా నటులు సాయి బాబా, రమేష్, ప్రవీణ్, రాజశేఖర్, శంకర్, శ్రీకాంత్, ఉదయ్ కుమార్, సోమరాజ్, చంద్రశేఖర్, నరసింహ రెడ్డి తదితరులకు, సింగర్ మేఘా రాజ్, ఎడిటర్ వేణు, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ కోటి, గీత రచయిత ప్రియాంక, ఇతర సహాయక బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు` అని పవన్ ట్వీట్ చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: