గద్దలకొండ గణేశ్ సినిమాలో సినీ దర్శకుల గురించి తనికెళ్ల భరణి ఓ డైలాగ్ చెప్తాడు. ‘వి ఆర్ ద క్రియేటర్స్.. మనం హీరోలను తయారు చేస్తాం’ అని. నాచురల్ స్టార్ నాని, వెర్సటైల్ డైరక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి లను చూస్తే భరణి డైలాగ్ అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. అసిస్టెంట్ డైరక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నానిలో ఓ హీరో ఉన్నాడని గమనించి.. తన అష్టా చమ్మా సినిమా ద్వారా హీరోని చేశాడు మోహన్ కృష్ణ. దర్శకుడి ఆలోచన, సునిశిత దృష్టికి ఉదాహరణగా నిలిచిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి పుట్టినరోజు నేడు.

 

 

ఈ సందర్భంగా మోహన్ కృష్ణ మేడ్ హీరో నానీ ఎంతో ఆత్మీయంగా ట్వీట్ చేశాడు. ‘’మోహన్ సర్.. నా 50వ సినిమా మీరే చేయాలి.. మీ 25వ సినిమా నేనే చేయాలి. విష్ యు వెరీ హ్యాపీ బర్త్ డే ఎట్ హోమ్ సర్’ అని ట్వీట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. దీనికి మోహన్ కృష్ణ థ్యాంక్స్ చెప్తూ నాని స్టైల్లోనే రిప్లై ఇచ్చాడు. ‘థాంక్యూ నాని. నీ 100వ సినిమా నా 50వ సినిమా కూడా మనిద్దరమే చేయాలి. మన కాంబినేషన్ ఇలాగే కొనసాగాలి. అతి త్వరగా ఈ లాక్ డౌన్ పూర్తికావాలి.. మనం తూటాల్లా బయటకు రావాలి’ అంటూ రిప్లై ఇచ్చాడు.

 

 

ప్రస్తుతం వీరిద్దరి సంభాషణల ట్వీట్లు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో నాని మోస్ట్ ఎలిజబుల్ హీరో. దర్శకుడిగా మోహన్ కృష్ణ సున్నితమైన కథలను తెరకెక్కించే వాల్యూబల్ దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్ లో అష్టాచెమ్మా, జెంటిల్ మెన్, సినిమాలు వచ్చాయి. ‘వి’ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. గురుశిష్యులు అనే పదానికి వీరిద్దరూ పర్యాయపదంలా నిలిచారనడంలో సందేహం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: