పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మాతగా మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్. 2012వ సంవత్సరంలో ఎంతో గొప్ప క్రేజ్ తో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో అత్యద్భుత విజయాన్ని అందుకుని కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అతి పెద్ద బ్రేక్ ను అందించింది. వాస్తవానికి తొలిసారిగా రవితేజ తో షాక్ అనే సినిమా తీసి ఫ్లాప్ అందుకొన్న హరీష్ శంకర్, ఆ తర్వాత ఆయనతోనే మరొకసారి మిరపకాయ్ సినిమా తీసి హిట్ కొట్టారు. దాని అనంతరం పవన్ తో తీసిన సినిమా గబ్బర్ సింగ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో హరీష్ తీసిన రామయ్య వస్తావయ్యా భారీ డిజాస్టర్ గా నిలిచింది. 

IHG

ఆపై ఆయన తీసిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ హిట్ కొట్టగా, దాని తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తీసిన దువ్వాడ జగన్నాథం యావరేజ్ విజయాన్ని, అలానే గత ఏడాది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన గద్దలకొండ గణేష్ సినిమాతో సూపర్ హిట్ ని దక్కించుకున్నారు హరీష్. ఇక అతి త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 28వ సినిమాగా తెరకెక్కనున్న మూవీకి దర్శకత్వం వహించనున్న హరీష్, ఆ సినిమా గురించిన కొన్ని ఆసక్తికర విశేషాలను నిన్న ఒక జాతీయ పత్రికతో పంచుకున్నారు. గబ్బర్ సింగ్ సూపర్ హిట్ తర్వాత పవన్ తో పనిచేసే అవకాశం తనకు దక్కలేదని, కాగా మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆయనతో వర్క్ చేసే అవకాశం రావడంతో, దాన్ని తప్పకుండా తాను వినియోగించుకొని ఆయనకు మరొక హిట్ ఇచ్చి తీరతానని హరీష్ అంటున్నారు. 

 

ప్రస్తుతం ఆ సినిమా కథ ఆల్మోస్ట్ పూర్తయిందని, ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశానని అన్నారు హరీష్. పవన్ కళ్యాణ్ ను ఒక దర్శకుడిగా కాకుండా ఒక అభిమానిగా చూసే తాను, ఈ సినిమా ద్వారా అభిమానులందరూ ఆశించే అన్ని అంశాలను పొందుపరిచినట్లు చెప్పారు. అతి త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. అలానే పవన్ సినిమా అనంతరం యువ నిర్మాతలైన మహేష్ ఎస్ కోనేరు, బన్నీ వాసు లతో కలిసి తాను కూడా నిర్మాతగా మారి ఇకపై పలు సినిమాలు కూడా నిర్మించనున్నట్లు చెప్పిన హరీష్, ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ ను సిద్ధం చేయడంతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం కూడా ఒక వండర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు చెప్పారు. ఇక అన్నీ కలిసొస్తే అతి త్వరలో మహేష్ ని కలిసి ఆ స్క్రిప్ట్ వినిపిస్తానని అన్నారు హరీష్......!!

మరింత సమాచారం తెలుసుకోండి: