సౌమ్య అంటే ఎవరు గుర్తు పట్టక పోవచ్చు. కాని సౌందర్య అంటే మాత్రం మరో సావిత్రి ..అని మాత్రం యావత్ భారత తెలుగు ప్రజలే కాదు సౌత్ లో ఉన్న తమిళ, కన్నడం మళయాళ ప్రేక్షకులు క్షణాలలో గుర్తు చేసుకుంటారు. అంతేకాదు వెంటనే తన జ్ఞాపకాలలోకి వెళతారు. తను నటించిన సినిమాలను ఒక్కోక్కటిగా గుర్తు చేసుకుంటారు. జులై 18, 1976 సౌందర్య ఎం.బి.బి.ఎస్ చదువుతుండగానే మొదటిసారి గంధర్వ (1992) సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో చదువును మధ్యలోనే ఆపేసింది. ఆ రోజు మొదలైన సౌందర్య సినీ ప్రస్థానం దాదాపు 12 ఏళ్ళు సక్సస్ ఫుల్ గా సాగింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషలలో మొత్తం కలిపి 100కు పైగా చిత్రాలలో నటించింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, మోహన్ బాబు లాంటి సీనియర్స్ తో పాటు శ్రీకాంత్, వినీత్, అబ్బాస్, జె.డి.చక్రవర్తి, సాయి కుమార్ లాంటి వాళ్ళతో నటించింది.

 

ఇక తమిళంలోను సూపర్ స్టార్ రజనీకాంత్ తో రెండు సూపర్ హిట్ సినిమాలు హిందీలో అమితాబ్ బచ్చన్ తో ఒక సినిమాలో నటించింది. సౌందర్య అత్యధికంగా చేసిన సినిమాలు తెలుగు మాత్రమే. ఇదే గొప్ప విశేషం అని చెప్పాలి. ఇక తెలుగులో వెంకటేష్ సౌందర్య జంట అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. ముఖ్యంగా సౌందర్య అంటే ప్రతీ ఒక్కరికి గుర్తొచ్చేది అలనాటి మేటి నటి సావిత్రి. సౌందర్య కి సావిత్రి అంటే విపరీతమైన అభిమానం అన్న విషయాన్ని ఎన్నో సందర్భాలలో తెలిపింది. నటనతో ఆవిడే స్పూర్తి అన్న విషయాన్ని కొన్ని సందర్భాలలో తెలిపింది. అంతేకాదు చాలామంది సౌందర్య ని సావిత్రి తో పోలిస్తే ఎంతో ఆనందించేది ...చాలా గొప్పగా ఫీలయ్యోది.

 

సినిమాలలో సక్సస్ ఫుల్ గా సాగుతుండగానే తన మేనమామ, తన బాల్య స్నేహితుడు, సాఫ్ట్‌వేర్ ఇంజనీరు అయిన జి.ఎస్.రఘు తో 2003 ఏప్రిల్ లో పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేయాలనుకున్నారు. కాని హఠాత్తుగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. అప్పుడు కూడా సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్ళి తిరిగు ప్రయాణం లో ఈ ప్రమాదం జరిగి 2004 ఏప్రిల్ 17 న మరణించారు. ఈ దుర్ఘటన వల్ల చిత్ర పరిశ్రమలోని వారందరూ కొన్నాళ్ళపాటు దిగ్బ్రాంతిలో ఉండిపోయారు. ఇక సావిత్రి తర్వాత చాలా ఏళ్ళకి ఆ స్థానం భర్తీ చేసింది సౌందర్య భర్తీ చేయడం గొప్ప విశేషం అయితే సౌందర్య మరణం తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు తన స్థానాన్ని భర్తీ చేయగల నటి లేకపోవడం ఆశ్చర్యకరం. 
  

మరింత సమాచారం తెలుసుకోండి: