ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటినీ గడగడలాడిస్తున్న కరోనా వైరస్ చైనా లో పుట్టి అక్కడి నుండి దాదాపు 200 దేశాలకు వ్యాపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే వైరస్ వల్ల కొన్ని వేల మరణాలు సంభవించగా మిలియన్లలో ప్రజలు దాని బారిన పడుతున్నారు. ఇక భారతదేశం విషయానికి వస్తే వరుసగా రెండోసారి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించగా ప్రజలంతా మరొక రెండు వారాలకు పైగా వారి ఇళ్లకే పరిమితం కానున్నారు.

 

మొట్టమొదటిసారిగా చైనా లో బయటపడ్డ వైరస్ అక్కడి వుహాన్ నగరాన్ని అతలాకుతలం చేయగా ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన చైనా దేశం మాత్రం ఇప్పటివరకు కేవలం 3,800 మరణాలు మాత్రమే తమ దేశంలో కరోనా వల్ల సంభవించినట్లు తెలపడం గమనార్హం. ముందు నుండే కరోనా పట్ల చైనా వారు వ్యవహరిస్తున్న తీరుపై అనేక అనుమానాలు ఉండగా వారే వైరస్ ను వారు కావాలని సృష్టించారని ఆరోపణలు మరియు వాటికి తగిన ఆధారాలు కూడా చాలానే ఉన్నాయి

 

అయితే అగ్రరాజ్యం అమెరికా సైతం అణచలేకపోయినా వైరస్ ను చైనా చాలా సులువుగా తప్పించుకున్న తీరు కూడా సందేహం రేకెత్తించేదే. ఇటువంటి సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్లతో స్టార్ హీరోలకు విపరీతమైన పోటీ ఇస్తున్న హీరో నిఖిల్ అని ఇది చైనా వారి కుట్ర తేల్చి చెప్పాడు.

 

చైనాలోని వూహాన్ నగరంలో కరోనా వైరస్‌ మొదటిసారి బయటపడిందని దీంతో అప్రమత్తమైన చైనా జనవరిలో వూహాన్ నగరం నుంచి ఇతర నగరాలకు డొమెస్టిక్‌ ఫ్లైట్స్‌తో పాటు ఇతర రవాణాలను నిలిపివేసిందని అన్నాడు. కానీ వుహన్‌ నగరం నుంచి ప్రపంచ దేశాలకు వెళ్ళే విమానాలకు మాత్రం అనుమతి ఇచ్చిందని.... ఇదంతా చూస్తుంటే ఉద్దేశ పూర్వకంగానే వైరస్‌ను ప్రపంచం మీదకి వదలకపోతే వుహన్‌ నుంచి అంతర్జాతీయ విమానాలను ఎందుకు నడిపిందని ప్రశ్నించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: