దేశంలో రోజు రోజుకీ విజృంభిస్తున్న కరోనాని కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ప్రజలు విచ్చల విడిగా రోడ్లపై రాకుండా పోలీసులు రేయింబవళ్లూ కష్టపడుతున్నారు. దేశ వ్యాప్తంగా పోలీసులు పడుతున్న కష్టాలకు సంబంధించి ఎన్నో పాటలు.. ప్రశంసలు  వస్తున్నాయి. కరోనాపై పోరాటంలో భాగంగా అలుపెరగకుండా శ్రమిస్తున్న వైద్య, పోలీసు, పారిశుద్ద్య సిబ్బందికి యావత్‌ ప్రపంచం సలామ్‌ చేస్తోంది.ఇప్పటికే వారి సేవలను కొనియాడుతూ అనేక మంది సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు.

 

తాజాగా టాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌, సింగర్‌ రఘు కుంచె తాజాగా ఓ పాటను రూపొందించారు. ‘సలాం నీకు పోలీసన్నా.. రెండు చేతులెత్తి నీకు మొక్కాలన్నా ’అంటూ సాగే ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. బండి సత్యం సాహిత్యం అందించగా రఘు కుంచె స్వయంగా ట్యూన్‌ కట్టి ఆలపించాడు. కాగా, పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు ఇలా ఈ లాక్‌డౌన్ సమయంలోనూ ప్రజల కోసం పనిచేస్తోన్నవారిపై ఇప్పటికే చాలా పాటలను విడుదల చేశారు.

 

సైబరాబాద్ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని పాటలను విడుదల చేశాయి. వీడియోలో పాట ప్రారంభవడానికి ముందు రఘు కుంచె ఒక మెసేజ్ కూడా రాశారు. ‘‘నేను హైదరాబాద్‌లో ఉంటాను. కరోనా మహమ్మారి ప్రబలుతున్న సమయంలో ఎవరి భయాలు వారికున్నట్టే నాకూ ఉన్నాయి. ఇంట్లో ఉంటూ నా జాగ్రత్తలు నేను తీసుకుంటున్నాను. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: