టాలీవుడ్ లో పదేళ్ల తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.  ఈ మూవీలో మాస్ ఎలిమెంట్స్ తో పాటు మంచి సోషల్ మెసేజ్ ఉండటంతో మంచి సక్సెస్ సాధించించింది.   ఈ మూవీ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ దేశ భక్తితో ఉండటంతో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశపడ్డారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినప్పటికీ తెలుగు లో తప్ప వేరే భాషల్లో పెద్దగా మెప్పించలేకపోయింది.  ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల దర్శకత్వంలో చిరంజీవి ‘ఆచార్య’ మూవీలో నటిస్తున్నాడు.  

 

మూవీ షూటింగ్ కరోనా వైరస్ ప్రభావంతో ఆగిపోయిన విషయం తెలిసిందే.  ‘భరత్ అనే నేను` తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా `ఆచార్య` సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నాడు. `ఆర్ఆర్ఆర్` వల్ల చెర్రీ బిజీగా ఉండడంతో అతని స్థానంలో సూపర్‌స్టార్ మహేష్‌ నటిస్తాడని ప్రచారం జరిగింది. తర్వాత మహేష్ బాబు తప్పుకున్నారని.. మళ్లీ చరణ్ లైన్లోకి వచ్చాడని వార్తలు వస్తున్నాయి.

 

తాజాగా ఈ సినిమాలో ఒక కీలకమైన రోల్ కోసం మోహన్ బాబును తీసుకోనున్నారనేది తాజా సమాచారం. మోహన్ బాబును చిరంజీవి అడిగితే, కామెడీ టచ్ లేకుండా పూర్తి నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర అయితే చేయడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని మోహన్ బాబు చెప్పారట. కొరటాల స్క్రిప్టులో మార్పులు చేసే పనిలో వున్నాడని అంటున్నారు. పాత్ర నచ్చితే మోహన్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో అబద్దమో కానీ..గతంలో కూడా ఈ టాపిక్ సోషల్ మీడియాలో హడావుడి చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: