అపుడెపుడో బ్రహ్మంగారు తెర మీద బొమ్మలు తైతక్కలాడడమే కాదు, దేశాన్ని కూడా ఏలుతాయని చెప్పారు. ఆయన జోస్యం అచ్చంగా నిజమైంది.అన్న నందమూరి పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చారు. ఆయన కొత్త రాజకీయ స్రుష్టి చేసి మరీ యువ రక్తాన్ని జాతికి అందించారు.

 

ఇపుడు ఆయన వారసులే రాజకీయాల్లో ఉన్నారు. వీరిని పక్కన  పెడితే మిగిలిన వారు కూడా రియల్ లైఫ్ లో హీరోలు కావాలనుకున్నారు. పార్టీలను పెట్టి జనంలోకి వచ్చారు. కానీ జనం మాత్రం గట్టిగానే తిరస్కరించారు. ఆ దెబ్బకు తాము రీల్ హీరోలమే తప్ప మరేమీ కాదన్న సత్యం చాలా మందికి బోధపడింది.

 

సరే ఇపుడు రీల్ హీరోలుగా ఉన్న వారికి ఆ రంగుని కూడా వెలిసిపోయేలా కరోనా వైరస్ చేస్తోంది. లాక్ డౌన్ కొనసాగుతున్న ఈ దశలో జనంలో ఉన్న వారే రియల్ హీరోలుగా కనిపిస్తున్నారు. ఆ మాటకు వస్తే వైద్యులు, పోలీస్. మీడియా, అధికారులు, ప్రజా ప్రతినిధులే ఇపుదు జనంలో కనిపిస్తున్నారు. వారే అన్నీ చూస్తున్నారు.

 

ఇపుడు రీల్ హీరోలు ఇంటికే పరిమితం అయ్యారు. వారి సినిమాలు ఆడే ధియేటర్లు మూత పడ్డాయి. అలాగే వారి ఊసు కూడా ఎక్కడా లేకుండా పోయింది. జనం కూడా తమ అత్యవసరాలపైనే ద్రుష్టి పెట్టారు. ముందు బతికుండాలి. దానికి నిత్యావసరాలు కావాలి. అవి ఉన్న తరువాతనే మిగిలినవి అంటున్నారు.

 

అంటే జనం ద్రుష్టిలో వినోదం ఇపుడు విలాసం అవుతోంది. దాంతో రీల్  హీరోలు సైతం వేషం తీసేశాక వెలితిగానే కనిపిస్తున్నారు. మనిషి ఆందందంగా ఉంటేనే వినోదాలు, ఉల్లాసాలు

 

 ప్రాణం మీదకు వస్తే రియల్ హీరోలే కనిపిస్తారు, వారితోనే అవసరం ఉంటుందన్న సత్యాన్ని కరోనా తెలియచేసింది మరి. ఇది వాస్తవం, ఇదే వాస్తవం.  అనుకోవాలి. అలా మసలుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: