టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ కాజల్. ఆమెతో సినిమాలు చేయడానికి ఎందరో దర్శక నిర్మాతలు పోటీ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆమె సినిమాలు అనగానే జనాలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది. వాళ్ళు కాజల్ హీరోయిన్ అంటే కచ్చితంగా సినిమాకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు ఆమె సీనియర్ హీరోయిన్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఆమె తో సినిమాలు చేసే వాళ్ళు ఇప్పుడు లేరు కూడా. ఇది పక్కన పెడితే కాజల్ ఇప్పుడు భారీగా డిమాండ్ చేస్తుందని టాక్. 

 

తన తో సినిమా చేసే వాళ్ళు లేకపోయినా సరే ఆమె డిమాండ్ చెయ్యాలి అనుకోవడం చూసి కొందరు షాక్ అవుతున్నారు. దానికి కారణం ఏంటీ అనేది చూస్తే... అగ్ర హీరోల సినిమాలకు ఆమెను మాత్రమే ఎంపిక చేస్తారని, అందుకే ఆమె భారీగా డిమాండ్ చేస్తుంది అంటున్నారు. అగ్ర హీరోల సినిమాల్లో ఆమె మినహా మరో ఆప్షన్ లేదు అనేది కొందరి మాట. ఏ హీరో అయినా సరే కాజల్ ఒక్కటే సరిపోతుంది అనే  భావనలో ఉన్నారని టాక్. టాలీవుడ్ లో అందుకే ఇప్పుడు ఆమె హవా నడుస్తుంది అంటున్నారు. 

 

చిరంజీవి సినిమాలో ఎందరో పేర్లను పరిశీలించి చివరికి ఆమె పేరుని ఖరారు చేసింది చిత్ర యూనిట్. ఆమె పేరు ను ముందు నుంచి పరిశీలిస్తున్నా సరే చివరికి ఆమె మినహా మరో మార్గం లేదని భావించి ఓకే చేసారని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇందుకోసం ఆమె దాదాపు గా కోటి వరకు డిమాండ్ చేసిందని అంటున్నారు. నిజమో కాదో తెలియదు గాని చిరంజీవి కూడా ఆమె అయితేనే బాగుంటుంది అని చెప్పారని అందుకే ఈ సినిమాకు ఆమె అంత డిమాండ్ చేసింది అని అంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: