రాజమౌళి అంటనే అజేయుడు. ఎదురులేని దర్శ‌క ధీరుడు. ఆయన ఈ తరంలో పద్మశ్రీ అవార్డు అందుకున్న మొనగాడు. ఆయన‌కు ఈ బిరుదులు అవార్డులు పక్కన పెడితే బాహబలి అంటే చాలు రాజమౌళి పేరు వేరేగా  చెప్పనక్కరలేదు. టాలీవుడ్ స్టామినా ఏంటో మొత్తం ప్రపంచానికి చూపించాడు. బాలీవుడ్ ని సైతం టాలీవుడ్ వైపు చూసేలా చేశాడు.

 

అంతేనా ప్యాన్ ఇండియా రుచి ఏంటో కూడా టాలీవుడ్ కి చూపించాడు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగులో రాజమౌలీ ఉన్నాడు. కరోనా నేపధ్యంలో ఈ సినిమా ఇపుడు ఆగింది. దాంతో 2021 సమ్మర్ రిలీజ్ కి డేట్ రెడీ చేసి పెట్టుకున్న రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ మూవీ తరువాత ప్రాజెక్ట్ కూడా లైన్లో పెట్టేసారని అంటున్నారు.

 

ఆ మూవీలో హీరో ఎవరో చెబితే షాకే. మన సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి మూవీ చేస్తున్నాడని అంటున్నాడు. ఇపుడు ఈ న్యూస్ బాగా స్ప్రెడ్ కావడంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారట. 

 

నిజానికి మహేష్ బాబు తో రాజమౌళి  మూవీ అంటే బాలీవుడ్లోకి ఈ హాలీవుడ్ స్టార్ రంగ ప్రవేశానికి  రాజమార్గం అంటున్నారు. రాజమౌళి మార్క్ డైరెక్షన్ కి మహేష్ మార్క్ యాక్షన్ జత కుదిరితే బొమ్మ బ్లాక్ బస్టర్ అవడమే కాదు మరో బాహుబలిగా ఉంటుందని అంటున్నారు.

 

ఇంతకీ ఆ మూవీ సోషల్ నా లేక జానపదమా అన్న చర్చ కూడా వస్తోంది. రాజమౌళి హీరోలు అంటే రెగ్యులర్ ఫార్మేట్ లో ఉండరు కాబట్టి ఇది కచ్చితంగా జానపదం అయినా ఆశ్చర్యపోనవసరం లేదని కూడా అంటున్నారు.

 

అదే నిజం అయితే మన మహేష్ బాబు అచ్చమైన రాజకుమారుడుగా జనాన్ని అలరిస్తారన్న మాట. మొత్తానికి చూడాలి ఆ రోజు ఎపుడు వస్తుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: