బిగ్ బీ అని ప్రేమ‌గా పిలుచుకునే ఇండియన్ సినిమా బిగ్ ఐకాన్ అమితాబ్ బచ్చన్‌కు.. ఇప్పుడు కూడా ఏ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోంగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బాలీవుడ్ సీనియర్ స్టార్‌ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌ ఉంటారో అందరికీ తెలిసిందే. తన సినిమాల అప్‌ డేట్స్‌ తో పాటు సామాజిక పరిస్థితులపై అభిప్రాయాలు పాటు సోషల్ మీడియాలో తనకు ఇంట్రస్టింగ్ గా అనిపించిన అంశాలను కూడా షేర్ చేస్తుంటాడు అమితాబ్‌. ఈ క్ర‌మంలోనే తాజాగా ఈయ‌న గ‌తంలో న‌టించిన షోలే సినిమా ప్రీమియ‌ర్ సీక్రెట్స్‌ను అభిమానుల‌తో పంచుకున్నారు.

IHG

షోలే  1975 ఆగ‌స్టు 15న‌ విడుదలయిన సూపర్ హిట్ హిందీ సినిమా. ఈ చిత్రానికి  రమేష్ సిప్పీ దర్శకత్వం వహించ‌గా.. ఆయ‌న తండ్రి జి.పి.సిప్పీ నిర్మించగా వ్య‌వ‌హ‌రించారు. ఈ సినిమాతోనే అమితాబ్ బచ్చన్ ఇండ‌స్ట్రీలో నిలదొక్కుకున్నాడ‌ని చెప్పాలి.  ఇక అంజాద్ ఖాన్‌కు ఇది తొలి సినిమా. మూడు కోట్ల భారీ బడ్జెట్టుతో నిర్మించబడిన ఈ సినిమా పూర్తి కావడానికి రెండున్నర సంవత్సరాలు పట్టింది.  ఈ చిత్రంలో బిగ్ బి భార్య మరియు బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టి జయ బచ్చన్ కూడా ఉన్నారు. అయితే ఈ సినిమా గురించి అభిమానుల‌తో బిగ్ బీ కొన్ని ముచ్చ‌ట్లు చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలోనే ఓ అరుదైన ఫోటోను కూడా పోస్ట్ చేశారు. 

 

ఈ ఫోటోలో బిగ్ బితో పాటు అతని తల్లిదండ్రులు తేజీ బచ్చన్,‌ హరివంశ్ రాయ్ బచ్చన్ మ‌రియు జయ బచ్చన్ ఉన్నారు. బిగ్ బీ పెట్టిన పోస్ట్‌లో.. వినోద్ ఖన్నాతో కలిసి తాను బాల్కనీ అంతస్తులో కూర్చుని తెల్లవారుజాము 3 గంటల వరకు సినిమా చూశానని వెల్లడించారు. మ‌రియు ఈ ఫోటోలో జ‌య ఎంతో అందంగా ఉందంటూ కొనియాడారు. ఇక ప్రీమియర్ సమయంలో 70 ఎంఎం స్టీరియో కస్టమ్స్‌లో చిక్కుకున్నందున, వారు 35 ఎంఎం ప్రింట్‌లో చిత్రాన్ని చూశారని నటుడు వెల్లడించారు. ఆ తరువాత 70 ఎంఎం వన్ వచ్చినప్పుడు, చిత్ర‌యూనిట్ మరియు ఇతరులు కలిసి తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ చిత్రాన్ని చూశార‌ని తెలిపారు. కాగా, షోలే సినిమాలో ధర్మేంద్ర, హేమ మాలిని, అమ్జాద్ ఖాన్ మరియు సంజీవ్ కుమార్ లతో పాటు అమితాబ్ బచ్చన్ మరియు జయ బచ్చన్ నటించారు. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: