సూపర్ స్టార్ మహేష్ హీరోగా 2015లో రిలీజ్ అయిన సూపర్ డూపర్ హిట్ మూవీ 'శ్రీమంతుడు'. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటించగా, మది ఫోటోగ్రఫిని, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించడం జరిగింది. ఎన్నో వేల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నప్పటికీ, దేశంలో ఎందరో ప్రజలు పడుతున్న బాధలకు చలించిపోయి, తనవంతుగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అక్కడి ప్రజల గుండెల్లో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న హర్ష అనే యువకుడి పాత్రలో సూపర్ స్టార్ మహేష్ నటించడం జరిగింది. 

IHG

ఇక ఆ పాత్రలో సూపర్ స్టార్ అత్యద్భుత నటన, హీరోయిన్ శృతి హాసన్ అందం అభినయంతో పాటు, స్క్రీన్ పై వారిద్దరి జోడి కూడా చూడచక్కగా కుదిరింది. అలానే దేవిశ్రీప్రసాద్ అందించిన అద్భుతమైన పాటలు, నేపధ్య సంగీతంతో పాటు, కెమెరామ్యాన్ మది అదిరిపోయే ఫోటోగ్రఫి, అన్నికంటే ముఖ్యంగా ఊరిని దత్తత తీసుకోవడం అనే సామజిక అంశాన్ని తీసుకుని దానిని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేవిధంగా పలు కమర్షియల్ హంగులు జోడించి మహేష్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల నుండి మంచి మార్కులు సంపాదించారు దర్శకుడు కొరటాల శివ. ఇక ఇటీవల రెండేళ్ల క్రితం నుండి ఈ సినిమా యూట్యూబ్ లో వీక్షకులకు అందుబాటులో ఉంది. 

 

కాగా ఈ సినిమా నేటితో ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ అందుకుని టాలీవుడ్ సినిమా చరిత్రలో యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ అందుతున్న తొట్ట తొలి సినిమాగా సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. అలానే 320కె లైక్స్ దక్కించుకున్న ఈ సినిమా రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డ్స్ కొడుతుందో చూడాలి. కాగా తమ హీరో సినిమా ఇంత గొప్ప రికార్డు సాధించడంతో పలువురు సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్, శ్రీమంతుడు యూనిట్ కి, ప్రత్యేకంగా తమ హీరో మహేష్ కు శుభాభినందనలు తెలియచేస్తూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ట్విట్టర్ లో ఈ సినిమా పేరిట పెద్ద ట్రెండ్ ని క్రియేట్ చేసి పరిగెత్తిస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: