మ‌హేష్ కెరీర్‌లోనే శ్రీమంతుడు సినిమాకు ఓ ప్ర‌త్యేక స్థానం ఉంది. మ‌హేష్  స్టార్‌డ‌మ్‌ను పెంచ‌డంలోనే కాదు..మార్కెట్‌ను అమాంతం విస్త‌రింప‌జేసింది ఈ చిత్రం. క్లాస్, మాస్ ఆడియోన్స్‌ల్లోని కొన్ని వ‌ర్గాలు కూడా అంటే వృద్ధులు, ప్రొఫెష‌న‌ల్స్ కూడా మ‌హేష్‌కు అభిమానులుగా మారారు. బాక్సాఫీస్ వ‌ద్ద‌ వ‌సూళ్ల వ‌ర్షం కురిపించిన చిత్రం నంది అవార్డును కూడా గెల్చుకోవ‌డం విశేషం. ఊరిని దత్తతకు తీసుకునే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. బాహుబలి వంటి సినిమా వచ్చిన నెల రోజుల వ్యవధిలో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.

 

అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ను తెర‌పై చూపుతూనే మంచి మెస్సేజ్‌ను జనంలోకి తీసుకెళ్ల‌డంలో ద‌ర్శ‌కుడు కొర‌టాల విజ‌య‌వంత‌మ‌య్యారు. అనేక కొత్త రికార్డుల‌ను కొల్ల‌గొట్టిన ఈ సినిమా తాజాగా మ‌రో రికార్డును బ్రేక్ చేయ‌డం గ‌మ‌నార్హం.2015లో విడుద‌లైన శ్రీమంతుడు మూవీ యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. 100 మిలియన్ వ్యూస్ సాధించిన తొలి తెలుగు సినిమాగా చ‌రిత్ర పుట‌ల్లోకి ఎక్కింది. తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన తెలుగు పాటలతో పాటు హిందీలో డబ్బింగ్ అయిన సినిమాలు మాత్రమే 100 మిలియన్ వ్యూస్‌కు పైగా దక్కించుకోవ‌డం గ‌మ‌నార్హం. 

 

అయితే స్ట్రెయిట్‌గా ఓ తెలుగు చిత్రం యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్‌ దక్కించుకోవడం మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాకే ఆ గొప్ప‌త‌నం ద‌క్కింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న విష‌యం తెలిసిందే.  ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉన్న మహేష్ బాబు కుటుంబ స‌భ్యుల మ‌ధ్య త‌న స‌మ‌యాన్ని గడుపుతున్నారు. లాక్‌డౌన్ త‌ర్వాత పరశురామ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నాడు. 

 


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: