టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం యువ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రిట్రో ప్రేమకథగా యూరోప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుస సక్సెస్భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటి భాగ్య శ్రీ, ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభాస్ కు ఒక్కసారిగా మన దేశంతో పాటు పలు విదేశాల్లో కూడా విపరీతమైన పేరు, కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన బాహుబలి రెండు సినిమాలు కూడా ఆయన కెరీర్ లో ఎప్పటికీ నిలిచిపోతాయి అనే చెప్పాలి. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్కా మీడియా బ్యానర్ పై ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కిన బాహుబలి, బాహుబలి 2, రెండూ ఒకదానిని మించి మరొకటి వందల కోట్ల రూపాయల కలెక్షన్ ని ఆర్జించాయి. 

 

ఇకపోతే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ఈ రెండు సినిమాల కోసం ప్రభాస్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదని అంటున్నారు కొందరు సినిమా పరిశ్రమకు చెందిన వారు. ముందుగా బాహుబలి సినిమాలు చేయాలని భావించినప్పుడే ఈ పాత్ర గురించి ప్రభాస్ కు పూర్తిగా వివరించిన రాజమౌళి, పాత్ర రీత్యా శారీరకంగా బాగా బరువు పెరగడంతో పాటు మంచి డైట్ తీసుకోవడం, అలానే ఎప్పటికప్పుడు బాగా కసరత్తులు చేస్తూ బాడీ ని మంచి షేప్ లో ఉంచడమే ముఖ్యం అని చెప్పారట. ఏది పడితే అది తినకూడదని, అలానే పీరియాడికల్ సినిమాలు కావడంతో డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్ వంటి వాటిల్లో మరింత కఠినంగా వ్యవహరించాలని చెప్పారట. 

 

అలానే రెండు సినిమాలకు కలిపి కొన్ని వందల రోజులు కాల్షీట్స్ అవసరం అవుతాయని, ఈ సినిమాలు పూర్తి అయ్యేవరకు మరొక సినిమా ఏది కూడా ఒప్పుకోకపోవడం బెటర్ అని కూడా సూచించారట. అయితే ముందుగా రాజమౌళి, ప్రభాస్ ఇద్దరూ కూడా ఈ రెండు భాగాలకు కలిపి మూడున్నరేళ్ల వరకు సమయం పడుతుందని అనుకున్నారట. కానీ దాదాపుగా మొత్తంగా ఐదేళ్ల వరకు సమయం పట్టింది. అన్ని రోజుల పాటు ప్రభాస్ బాహుబలి సినిమాలకే పూర్తిగా అంకితం అయ్యి, దర్శకుడు రాజమౌళి చెప్పిన ప్రకారం ఎప్పటికప్పుడు పలు కఠిన నియమాలు పాటించి వాటిని పూర్తి చేసారని, అందుకే ఆ సినిమా విజయంలో హీరో ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తారని అంటున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: