ముందుగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన దేవదాసు సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది గోవా భామ ఇలియానా. రామ్ హీరోగా నటించిన ఆ సినిమాని వై వి ఎస్ చౌదరి తన బొమ్మరిల్లు బ్యానర్ పై నిర్మించడం జరిగింది. అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఆ సినిమా హిట్ కొట్టి, తొలి సినిమాతోనే ఇలియానాకు పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ హీరోగా, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమాలో ఛాన్స్ కొట్టిన ఇలియానా, అనూహ్యంగా ఆ సినిమా అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో ఒక్కసారిగా ఎంతో గొప్ప పేరు దక్కించుకుంది. 

 

ఇక అక్కడి నుండి ఈ అమ్మడుకి తెలుగు తో పాటు అటు తమిళ్ లో కూడా అవకాశాలు బాగా పెరిగాయి. ఆ తరువాత నుండి పలువురు టాలీవుడ్ అగ్ర నటుల సరసన నటించిన ఇలియానా, కొన్నాళ్ల క్రితం తన లవర్ ఆండ్రూ నీ బోన్ తో ప్రేమాయణం నడిపింది. అయితే మధ్యలో ఏమి జరిగిందో ఏమో తెలియదుగాని ఇటీవల అతడి నుండి విడిపోయిన ఇలియానా ప్రస్తుతం తన ఫ్యామిలితో కలిసి జీవిస్తోంది. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం కొంత బొద్దుగా మారిన ఇలియానాకు అవకాశాలు చాలావరకు తగ్గిపోయాయి అనే చెప్పాలి. అయితే బాలీవుడ్ లో మాత్రం ఈ అమ్మడు అక్కడక్కడా కొన్ని సినిమాలు ఇటీవల చేయడం జరిగింది. 

 

అయితే ప్రస్తుతం తన బొద్దుతనాన్ని మెల్లగా తగ్గించుకునే పనిలో పడ్డ ఇలియానా, కొంత డైటింగ్ తో పాటు పలు రకాల కసరత్తులు ఎంతో పద్దతిగా చేస్తోందట. ఇక గతంతో పోలిస్తే ప్రస్తుతం కొంత స్లిమ్ అయిన ఇలియానా, కొన్ని వారాల క్రితం తన యద అందాలు ఆరబోస్తూ బీచ్ ఒడ్డున దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ ఫోటోలు చూసిన పలువురు ఆమె అభిమానులు, ప్రేక్షకులు, నిజంగా ఇలియానా ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ అందాల ఆరబోతను ఎప్పుడూ చూడలేదని, ఆమెను చూస్తుంటే, రాబోయే మరికొద్దిరోజుల్లో మరింత స్లిమ్ గా మారి, మెల్లగా తన పూర్వ రూపుకు వచ్చేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.... !!

 

మరింత సమాచారం తెలుసుకోండి: