కరోనా వైరస్ ప్రభావానికి వ్యవస్థలన్నీ లాక్ డౌన్ అయిపోయాయి. ఇందులో సినీ పరిశ్రమ కూడా ఉంది. షూటింగ్స్ లేక కార్మికులు అందరూ ఉపాధి కోల్పోయారు. దీనిపై మన తెలుగులో మెగాస్టార్ చిరంజీవి బాధ్యత తీసుకుని ‘సీసీసీ మనకోసం’ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థ ద్వారా కార్మికులకు నిత్యావసరాలు కూడా అందిస్తున్నారు. చిరంజీవి చొరవ తీసుకుని ఏర్పాటు చేసిన ఈ సంస్థకు తెలుగు సెలబ్రిటీల నుంచి బాగానే విరాళాలు వస్తున్నాయి. ఈ విషయమై తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

 

 

చిరంజీవి చైర్మన్ గా ఏర్పాటైన సీసీసీ గురించి తెలుసుకున్న అమితాబ్ బచ్చన్ చిరంజీవిని ప్రశంసల్లో ముంచెత్తారు. ‘చిరంజీవి చైర్మన్ గా ఏర్పాటు చేసిన సీసీసీ గురించి తెలుసుకున్నాను. టాలీవుడ్ కి చెందిన మరికొంతమంది సెలబ్రిటీల సహాయంతో దాదాపు 8కోట్లు విరాళాలుగా రావడం గొప్ప విషయం. దీని ద్వారా దాదాపు 12వేల మంది కార్మికులకు నిత్యావసరాలు అందడం సంతోషం కలిగిస్తోంది. ఈ మహాత్కార్యానికి సహకరిస్తున్న వారందరినీ అభినందిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. చిరంజీవి కూడా అమితాబ్ బచ్చన్ కు కృతజ్ఞతలు చెప్తూ రీట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

అమితాబ్ రీసెంట్ గా స్పందించి ‘సీసీసీ’ కి 1500 విలువ చేసే 12,000 బిగ్ బజార్ కూపన్లు అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో సీసీసీ ద్వారా జరుగుతున్న నిత్యావసరాల పంపిణీపై తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మంచి స్పందన వస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి నుంచి మొదలు సీసీసీకి స్పందించి విరాళాలు ఇస్తున్న వారిపై ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చారిటీపై చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. దీనిపై అన్ని భాషల సినీ పరిశ్రమల్లో మంచి స్పందన వస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: