భారతదేశపు టాప్ ఫిలిం డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తదుపరి చిత్రం 'ఆర్ఆర్ఆర్' (రణం రౌద్రం రుధిరం) పై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న చిత్రంలో బాలీవుడ్ తారాగణం ఆలియా భట్ మరియు అజయ్ దేవగన్ కూడా కొన్ని కీలక పాత్రలు పోషించనుండడంతో చిత్రం పై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

 

ఇటీవలే చిత్రం టైటిల్ పోస్టర్ తో పాటు ఒక చిన్న వీడియోని రిలీజ్ చేయగా దానికి తారక్ మరియు చరణ్ ఫ్యాన్స్ పిచ్చెక్కి పోయారు. రామ్ చరణ్ ను అగ్నిగా మరియు తారక్ ను నీటికి ప్రతిరూపంగా చూపిస్తూ చేసిన వీడియోలో ఎలివేషన్స్ అయితే వేరే లెవెల్ లో ఉన్నాయి. ఇకపోతే మధ్యనే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అతనిని అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ తో ఒక స్పెషల్ వీడియో అభిమానుల కోసం రిలీజ్ చేశారు. అనుకున్నట్టే వీడియో కూడా అందరికీ పిచ్చపిచ్చగా నచ్చేసింది.

 

ఇకపోతే మరికొద్ది రోజుల్లో రానున్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం నుంచి ఎటువంటి వీడియో విడుదల కాదేమో అని రాజమౌళి సందేహం వ్యక్తం చేశాడు. రామ్ చరణ్ కు సంబంధించిన స్పెషల్ వీడియోని తాము ముందుగానే ప్లాన్ చేశామని చెప్పిన రాజమౌళి తెలుగు వర్షన్ ఎప్పుడో పూర్తయిందని మరియు లాక్ డౌన్ కారణంగా ఇతర భాషల్లో ఎన్టీఆర్ డైలాగులు వీడియో కాలింగ్ లో చెప్పించి విడుదల చేశామని అన్నారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కోసం కూడా తాము స్పెషల్ గా ఒక వీడియో చిత్రీకరణ చేద్దామని ముందే అనుకున్నా లాక్ కారణంగా అది సాధ్యపడేలా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: