ఆయన పేరు ఒక బగ బగ మండే బంగారం.. ఎక్కడ నెగ్గలో కాదు ఎక్కడ తగ్గలో తెలిసిన వాడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ...యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో..ఎన్నో సినిమాలలో , విభిన్న గెటప్ లలో నటించిన పవన్ ఎన్నో అవార్డులను అందుకున్నారు..ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా నటించి సినీ అభిమానులను సంపాదించుకున్న నటుడు.అలాంటి పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అంటే యూత్ కు ఎంతో అభిమానం దీంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..

 

 

 

ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే ఎన్నో అవార్డులను అందుకున్నారు..సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ కొత్త సినిమాలను చేస్తున్నాడు .అయితే ఆ సినిమాలలో కొన్ని సినిమాలు పవన్ కళ్యాణ్ కు ఎనలేని గౌరవం తో పాటుగా అభిమానుల మనసును కూడా చూరగొన్నారు.. అందుకే ట్రెండ్ ను సెట్ చేసే స్టార్ హీరో గా యువతలో హవాను కొనసాగిస్తున్నారు.. ఇకపోతే సినిమా లో కొన్ని సీన్లు మరియు పాటలు సినిమాలకు మరింత హంగును తీసుకొచ్చాయి.  అవేంటో చూడండి...

 

జ్వరమొచ్చింది.. 

 

 

వావ్ ఈ పాట విన్నవాల్లకు జ్వరమొచ్చింది.. పవన్ ఇంత రొమాన్స్ చేస్తాడా అన్న డౌట్స్ అందరికీ వస్తుంది.. కెమరామెన్ గంగతో రాంబాబు సినిమాలో ఈ పాట అంతా ఊపేసింది.. 

 

 

కెవ్వు కేక...

 

 

గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ ప్రేమాయానికి ఈ పాట పునాది లాంటిది.ఎప్పుడో వచ్చినా ఈ పాటకు ఇప్పటికీ ఎక్కడా క్రేజ్ తగ్గలేదు.. అందుకే సినిమా సూపర్ హిట్ అయ్యింది.. 

 

 

ఇట్స్ టైం టూ పార్టీ...

 

 

అత్తారింటికి దారేది ... సినిమా నుంచి వచ్చిన ఈ పాట .. సినిమా స్థాయిని పెంచే రేంజులో ఉంది.  అమ్మాయిలతో పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్పులు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచారు.. 

 

 . 

ఇదండీ పవన్ కళ్యాణ్ సినిమాలకు డిమాండ్ ఎందుకో చెప్పిన సినిమాలు.. ప్రస్తుతం వకీల్ సాబ్ , విరూపాక్ష సినిమాలలో నటిస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: