కరోనా ఎక్కువ విస్తరించకుండా ప్రధాని ప్రకటించిన లాక్ డౌన్ ను కొందరు సీరియస్ గా తీసుకోవట్లేదని.. కేవలం అవసరం ఉంటేనే బయటకు రండని అంటుంటే.. అవసరం ఉన్నా లేకున్నా సరే బయటకు వస్తున్నారని అంటున్నారు ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మీ. ఎప్పుడు సోషల్  గా ఉండే రష్మీ గౌతమ్ తాను చెప్పాలనుకున్న విషయాన్నీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంది. లేటెస్ట్ గా ఇన్ స్టా లైవ్ లో పాల్గొన్న రష్మీ చీటికీమాటికీ బయటకు ప్రజలు ఎందుకు బయటకు తిరుగుతున్నారో అంటూ క్లాస్ పీకింది. 


అంతేకాదు ఒకసారి రబ్బర్ అని, పెన్సిల్ అని ఇలా ఏదో ఒక కారణంతో బయటకు వెళ్తున్నారు. మూడు నెలలు పిజ్జాలు తినకుండా ఉండలేరా.. ఇంట్లో రోటీ, పప్పులాంటివి చేసుకుని తినొచ్చు కదా అంటూ ఫైర్ అయ్యింది. అంతగా ఖాళీగా ఉంటె ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. చిరంజీవి గారు ఇంటిని శుభ్రం చేస్తున్నారు. స్వయంగా చిరంజీవి గారే తోటపని చేస్తుంటే మీకేమైంది.. మీకు హాలీడేస్ ఏమైనా ఇచ్చారా అంటూ కడిగిపారేస్తుంది. 


ఇక చెత్త బండి వచ్చినప్పుడు మీ ఫ్లాట్ కు వచ్చి చెత్త తీసుకుని వెళ్ళాలా.. మీరు వెళ్లి ఆ చెత్త వేసి రావోచ్చు కదా. ప్రస్తుతం వారు ఒకరు మాత్రమే వర్క్ చేస్తున్నారు. అందుకే మీరే స్వయంగా వెళ్లి చెత్త బయటకు తీసుకెళ్లి వారి వాహనంలో వేస్తె తప్పేముందని అంటుంది రష్మీ. లాక్ డౌన్ టైం లో కేవలం మనుషులే కాదు జంతువులు కూడా ఆకలితో అలమటించిపోతున్నాయని.. తన టీం తో కలిసి రోడ్ల మీద కనిపించిన కుక్కలకు ఫుడ్ అందించింది రష్మీ. రష్మీ చేస్తున్న మంచి పనులకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తన మంచి మనసుని అందరు మెచ్చుకుంటున్నారు. యాంకర్ గా అలరిస్తూనే సామాజిక బాధ్యతతో రష్మీ ఎప్పడు తనవంతు సాయం చేయడమే కాదు ప్రజలకు అవగాహన కలిగించడంలో ముందుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: