మన తెలుగు బుల్లితెర మీద ఎక్కువగా ప్రభావం చూపించిన యాంకర్ సుమా. ఆమెకు ఉన్న క్రేజ్ హీరో తో ఉన్న క్రేజ్ తో సమానంగా ఉంటుంది. ఆమె తో సినిమా చేయడానికి కూడా ఎందరో ప్రయత్నాలు చేసినా ఆమె మాత్రం అంతగా ఆసక్తి చూపించలేదు. సినిమాలకు ఆమె అంతగా ఆసక్తి చూపించడం లేదు ముందు నుంచి కూడా. అయితే ఇప్పుడు సినిమాలకు భారీగా మార్కెట్ పెరిగింది. దీనితో ఆమె ఇప్పుడు తెలుగులో కొన్ని సినిమాలకు నిర్మాతగా మారాలని భావిస్తున్నట్టు సమాచారం. చిన్న చిన్న సినిమాలకు ఆమె నిర్మాత గా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తుంది. 

 

తనకు బాగా పరిచయం ఉన్న దర్శకుడి తో ఆమె ఇప్పటికే చర్చలు జరిపి తాను 30 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని చెప్పినట్టు సమాచారం. అగ్ర హీరో తో సినిమా అయినా సరే తాను చేస్తాను అని చెప్పినట్టు సమాచారం. చిన్న హీరోల సినిమా అయితే తాను పూర్తి గా ఆయన సినిమా చేస్తాను అని చెప్పినట్టు తెలుస్తుంది. పెద్ద పెద్ద సినిమాలకు ఈ మధ్య భారీగా మార్కెట్ పెరిగిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఆమె ఆసక్తి చూపిస్తుంది అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో గాని ఆమె శర్వానంద్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించింది అంటున్నారు. 

 

కథ బాగుంటే మాత్రం వెంటనే సినిమాను మొదలు పెడతాను అని ఆమె చెప్పెసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఆమె మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి అనేది అర్ధమవుతుంది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం సుమా టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న యాంకర్. ఆమె తో సినిమా కార్యక్రమాలను కూడా దర్శకులు ఎక్కువగా చేస్తున్నారు. ఇక సినిమాల మీద ఆమె అందుకే ఆసక్తి చూపిస్తుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: