బాలీవుడ్ హీరోయిన్ లతో సినిమాలు అనగానే మన తెలుగులో ఒక రకమైన క్రేజ్ అనేది ఉంటుంది ఈ మధ్య కాలంలో. వాళ్ళతో సినిమాలు చేయడానికి ఎక్కువగా మన దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు, పెద్ద పెద్ద హీరోల సినిమాలు అయితే చాలు నిర్మాతలు ఇప్పుడు వారి మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. పెద్ద హీరోల సినిమాల కోసం ఎందరో దర్శక నిర్మాతలు ఎదురు చూస్తూ... వారితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు అక్కడి హీరోయిన్ లు మన తెలుగులో సినిమా చేయడానికి భారీగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

 

అయినా సరే మన తెలుగు నిర్మాతలు మాత్రం వారినే కావాలి అంటున్నారు. ఇన్నాళ్ళు ఇక్కడి హీరోయిన్ లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించిన వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడి హీరోయిన్ లను తీసుకోవడానికి గానూ ఇక్కడి హీరోయిన్ లను చిన్న చూపు చూస్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కనీసం ఇక్కడి వారిని అసలు పెట్టించుకోవడం లేదు మన నిర్మాతలు అని సమాచారం. దీనిపై అక్కడి నిర్మాతలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళకు అంత డిమాండ్ ఉందా అక్కడ అంటూ వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు. 

 

ఈ మధ్య పూజ రష్మిక కు ఇక్కడ డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పుడు వాళ్ళ ను కూడా పక్కన పెట్టాలి బాలీవుడ్ హీరోయిన్ ల కోసం అని ఇక్కడి నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం. దీనికి కారణం ఏంటీ అనేది తెలియక పోయినా కొందరు చెప్పే దాని ప్రకారం చూస్తే అక్కడి హీరోయిన్ లకు మార్కెట్ అనేది ఎక్కువగా ఉంటుంది అని అందుకే ఇక్కడి హీరోయిన్ లను కాదు అని అక్కడి వారి తో సినిమా చెయ్యాలి అని భావిస్తున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: