యువ హీరోలతో సమానం గా సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. ఆయన చాలా వేగంగా దూకుడుగా సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. అగ్ర దర్శకులు, తన కొడుకు నిర్మాతగా ఆయన వరుసగా సినిమాలను చేయడానికి రెడీ అయ్యారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కథ బాగుంది అనుకుంటే చాలు ఆయన ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి సినిమాను మొదలు పెట్టే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కూడా. 

 

ఇక ఆ సినిమా తర్వాత ఆయన ఒక భారీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అది ఏ సినిమా అనేది తెలియకపోయినా తమిళ హీరో తో కలిసి ఆయన సినిమా చేయడానికి రెడీ అయినట్టు సమాచారం. టాలీవుడ్ జనాలు ఇప్పుడు చిరంజీవి సినిమాల మీద కాస్త ఎక్కువగానే ఆసక్తి చూపిస్తున్నారు. ఇక తనకు వయసు కూడా మీద పడుతుంది కాబట్టి చిరంజీవి త్వరగా సినిమాలను చేసి తప్పుకోవాలి అని భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు చిరంజీవి తో సినిమా చేయడానికి నిర్మాతలు దర్శకులు కూడా ముందుకి వస్తున్నారు. 

 

ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఆయన ఒక సినిమా విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు. తమిళ హీరో తో కలిసి నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తన కొడుకుకి మార్కెట్ పెంచడానికి ఇతర భాషల్లో అందుకే ఆయన ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ విషయంలో ఆసక్తి చూపిస్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆ సినిమాను భారీ బడ్జెట్ తో చేస్తున్నారు. 2022 కి ఆ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ కూడా చేస్తున్నారు. ఆ సినిమా నిర్మాత కూడా రామ్ చరణ్ అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: