టాలీవుడ్ బాలకృష్ణ సినిమాలకు ఒకప్పుడు బాగా క్రేజ్ ఉండేది. ఆయన సినిమాలకు ఒక ట్రెండ్ కూడా ఉండేది మన తెలుగులో అనేది వాస్తవం. బాలకృష్ణ ఒక కథను ఎంచుకున్నారు అంటే ఆ కథకు భారీగా క్రేజ్ ఉండేది. ఫ్యాక్షన్ సినిమాలు అంటే చాలు బాలకృష్ణ బాగా గుర్తుకు వస్తు ఉంటారు ఆయన చేసిన ఫ్యాక్షన్ సినిమాలు మరో హీరో చేయలేదు అనేది వాస్తవం. దీనికి ఇప్పటికి క్రేజ్ ఉంది. తెలుగులో ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్ ని చూసి ఒకప్పుడు బాలీవుడ్ దర్శకులు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండే వాళ్ళని సమాచారం. 

 

ఆయన సినిమాలను నిర్మించడానికి అప్పట్లో నిర్మాతలు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండే వాళ్ళు. అయితే ఇప్పుడు ఆయన క్రేజ్... బాగా తగ్గింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఆయన తో సినిమా చేయడానికి ఎవరూ కూడా ముందుకు రావడం లేదని టాలీవుడ్ జనాలు అంటున్నారు. చిన్న చిన్న నిర్మాతలు కూడా బాలకృష్ణ విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అనేది టాలీవుడ్ లో ఇప్పుడు వినపడుతున్న టాక్. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని నిర్మాతల కోసం బాలయ్య కష్టపడుతున్నారు. 

 

ఇప్పటి వరకు గత మూడేళ్ళు గా ఆయన తో సినిమా చేసిన నిర్మాతలు భారీగా నష్టపోయినట్టు సమాచారం. అందుకే ఆయన తో సినిమా చేయడానికి ఎవరూ ముందుకి రావడం లేదని సమాచారం. మన తెలుగు లో కూడా ఆయన సినిమాలకు క్రేజ్ తగ్గింది కాబట్టి ఇతర భాషల్లో అయితే అసలు పట్టించుకోవడం లేదని అంటున్నారు. బాలకృష్ణ కూడా దాన్ని దృష్టి లో పెట్టుకుని ఇప్పుడు వరుసగా సినిమాలను చేయకుండా ఒకటికి పది సార్లు ఆలోచన చేసిన తర్వాతే సినిమాలను చేయడానికి రెడీ అవుతున్నారట. దర్శకులు కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: