కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమయంలో ప్రజల్లో అవేర్నెస్ కలిగించేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బెబో కరీనా కపూర్ కూడా తన వంతుగా మెసేజ్ ఇచ్చింది. శుక్రవారం కరీనా కనిపించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కరీనా డిస్ఇన్ఫెక్టెంట్ తో కిచెన్‌తో పాటు ఇంట్లోనే ఇంట్లోని వస్తువులను క్లీన్ చేస్తూ కనిపించింది.
`ఆరోగ్యకరమైన ఫుడ్ తినటం, కిచెన్‌ను శుభ్రంగా ఉంచుకోవటం లాంటి విషయాలు మనకు తెలుసు. క్లీన్ చేయటానికి డిస్ ఇన్ఫెక్టెంట్ వాడటం కూడా అంతే ఇంపార్టెంట్. ఏ డిస్ఇన్ఫెక్టెంట్ వాడినా పర్వాలేదు. కానీ మీరు తరచు తాకే వస్తువులను ప్రతీ సారి క్లీన్ చేయండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా అదే చెపుతోంది. నేను అదే పాటిస్తున్నా.. నువ్వు కూడా పాటించు` అంటూ చెప్పింది.