తెలుగు సినిమాలన్నీ ప్రేమ అన్న కాన్సెప్ట్ పైనే తెరకెక్కుతుంటాయి. దాదాపుగా ప్రతీ సినిమాలో ప్రేమ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కే చిత్రాలలో సైతం లవ్ ట్రాక్ ఉంటుంది. ప్రేమ అన్న కాన్సెప్ట్ లేకుండా ఓన్లీ జోనర్ మూవీని తీస్తే హిట్ అయిన సందర్భాలు చాలా తక్కువ. అందుకే రిస్క్ తీసుకోవద్దనే ఉద్దేశ్యంతో మన సినిమాల్లో ఎక్కడో అక్కడ హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ఉంటుంది.

 

అయితే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో లవ్ ట్రాక్ ఉండదని వార్తలు వస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో లారీ డ్రైవర్ గా బన్నీ కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పుష్ప ఫస్ట్ లుక్ పోస్టర్ కి విశేష స్పందన వచ్చింది. మాస్ లుక్ లో అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది. చూడగానే లారీ డ్రైవర్ అనిపించేలా తీర్చిదిద్దారు. 

 

ఇప్పటి దాకా అల్ట్రా స్తైలిష్ గా చూసిన అల్లు అర్జున్ మొదటిసారి ఊరమాస్ లుక్ లో చూడబోతున్నాం. అల్లు అర్జున్ మాస్ గా కనిపిస్తున్నాడంటే హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక లుక్ కూడా అలాగే ఉంటుందని అర్థమైపోయింది. రంగస్థలంలో సమంత మాదిరిగా రష్మిక కూడా పల్లెటూరి అమ్మాయిలా కనిపించనుందట. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కే ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మధ్య రంగస్థలం మాదిరి లవ్ ట్రాక్ ఉంటుందేమో అనుకుంటున్నారు.

 

సినిమా మొదటి నుండి వీరిద్దరు భార్యాభర్తలుగానే కనిపిస్తారట. అంతేకాదు చిత్తూరు ప్రాంత యాసలో వీరిద్దరి మాట్లాడుకునే మాటలు చాలా బాగుంటాయట. భార్యభర్తలుగా వీరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉండనుందని అంటున్నారు. ఇప్పటి వరకు ప్రేమికుల మధ్య ప్రేమ ఎలా ఉంటుందో చూపించిన సుకుమార్, మొదటిసారిగా భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమని చూపించబోతున్నాడని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: