సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు రీమేక్ ల పరంపర కొనసాగుతోంది. మన సౌత్ ఇండియా సినిమాల కోసం బాలీవుడ్ నిర్మాతలు కాచుకొని కూర్చొని ఉంటే అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలను మన వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే అక్కడ మంచి విజయం సొంత చేసుకున్న 'అందాదున్' మన వాళ్ళు తెచ్చేసుకున్నారు. మన ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ అక్కడ 'కబీర్ సింగ్' పేరుతో రిలీజ్ అయి భారీ హిట్టై వసూళ్ల వర్షం కురిపించింది. దీంతో తెలుగులో హిట్ అయిన ‘జెర్సీ', 'ఆర్ఎక్స్100′, 'ఓ బేబీ’ చిత్రాల రైట్స్ ను ఇప్పటికే బాలీవుడ్ నిర్మాతలు కొనేశారు.

 

అలాగే 'భీష్మ' చిత్రాన్ని కూడా హిందీలోకి రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు రోజూ వింటూనే ఉన్నాం. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా కనిపించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా రణబీర్ కపూర్ ప్లేస్ లో అర్జున్ కపూర్ ని హీరోగా పెట్టి ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలని చూస్తున్నారట. రణబీర్ కపూర్ ఇప్పటికే వరుస సినిమాలకు కమిట్ అవ్వడం.. పైగా భీష్మ స్క్రిప్ట్ అర్జున్ కపూర్ కి బాగుంటుందనే ఫీల్ రావడంతో కరుణ్ జోహార్, అర్జున్ కపూర్ ను హీరోగా పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడట.

 

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన 'భీష్మ' సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. ఈ సినిమాకు ఓవర్ సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల అన్ని కేంద్రాల్లో భారీ కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ఈ సినిమా రెట్టింపు లాభాలను సొంతం చేసుకుంది. హీరో నితిన్ కి కూడా సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. మరి ఈ సినిమా అర్జున్ కపూర్ కి కూడా సూపర్ హిట్ ని ఇస్తుందా.. అలాగే నితిన్ చేసిన పాత్రలో అర్జున్ కపూర్ ఎలా నటిస్తాడో చూడాలి. వెంకీ కుడుములు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటించిన లక్కీ హీరోయిన్ రష్మిక కి కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది. మరి హిందీ రీమేక్ లో కూడా ఈ ముద్దుగుమ్మ నే తీసుకుంటారేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: