శ్రీ లంక లో గ్లామర్‌ రంగంలో కెరీర్ ప్రారంభించిన జాక్వెలిన్‌ తరువాత బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి ఇండియాలో టాప్ సెలబ్రిటీల్లో ఒకరిగా ఎదిగింది. బాలీవుడ్‌ హీరోయిన్ గా కొనసాగుతూనే స్పెషల్ సాంగ్స్‌లోనూ నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. సినీ రంగంతో పాటు మోడలింగ్‌, స్పాన్సర్‌షిప్స్‌లోనూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ భారీగా ఆస్తులు వెనకేసుకుంది.

 

జాక్వెలిన్‌ ముందుగా మోడలింగ్ కెరీర్‌ను శ్రీలంకలోనే ప్రారంభించింది. అక్క డ2006లో ఆమె మిస్‌ శ్రీలంకగా అవార్డును కూడా అందుకుంది. అదే ఏడాది మిస్‌ యూనివర్స్‌ పోటిల్లోనూ శ్రీలంక తరుపున బరిలో నిలిచింది. ఈ కాంపిటీషన్స్‌ ద్వారా వచ్చి క్రేజ్‌తో ఆమెకు ఇండియాలోనూ మోడలింగ్‌ ఆఫర్లు వచ్చాయి. ఇండియాలో మోడల్‌గా అడుగు పెట్టిన జాక్వెలిన్‌కు బాలీవుడ్ అవకాశాలు కూడా క్యూ కట్టాయి. సుజయ్‌ గోష్ దర్శకత్వంలో తెరకెకక్కిన అల్లాదిన్ సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది.

 

బాలీవుడ్ సూపర్‌ హిట్స్‌ మర్డర్‌ 2, హౌస్‌ఫుల్ 2, కిక్‌ లాంటి సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ఆస్తుల విలువ దాదాపు 9 మిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే ఇండియన్ కారెన్సీ లెక్కల ప్రకారం దాదాపు 70 కోట్ల వరకు ఆమె ఆస్తి ఉంటుందని అంచనా వేస్తున్నారు. జాక్వెలిన్‌ ఒక్కో సినిమాకు దాదాపు 2 నుంచి 3 కోట్ల వరకు పేమెంట్ తీసుకుంటుంది. సల్మాన్ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన కిక్‌ సినిమాకైతే ఏకంగా 6 కోట్ల రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్టుగా అంచనా వేస్తున్నారు.

 

వీటితో పాటు స్నాప్‌డీల్, హెచ్‌టీసీ వన్‌ లాంటి భారీ బ్రాండ్‌లు ఈ భామ చేతిలో ఉన్నాయి. ఇటీవల ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం సాహోలోనూ స్పెషల్ సాంగ్‌లో నటించి ఆకట్టుకుంది జాక్వెలిన్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: